హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ రాజీనామా

ఖట్టర్‌తోపాటు ఆయన మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్ బండారు దత్తాత్రేయకు వారి రాజీనామా లేఖలు అందజేశారు.

లైవ్ కవరేజీ

  1. ఏనుగులు చనిపోయిన తమ పిల్లలను ఖననం చేస్తాయా? పరిశోధకుల కెమెరాలకు చిక్కిన దృశ్యాలలో ఏముంది?

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..

    గుడ్ నైట్.

  3. ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందజేసిన ఎస్‌బీఐ

    ఎస్బీఐ

    ఫొటో సోర్స్, Getty Images

    సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను భారత ఎన్నికల సంఘానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపింది.

    ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మార్చి 6 కల్లా ఎన్నికల సంఘానికి ఈ బాండ్లకు సంబంధించిన సమాచారం సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది.

    అయితే, ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని కోరుతూ ఎస్‌బీఐ పిటిషన్‌ వేసింది. ఈనెల 11న ఆ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు అభ్యర్థనను తిరస్కరించింది.

    మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం ఐదు గంటల లోపు ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈసీఐను ఆదేశించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం

    నాయబ్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, హరియాణా సీఎంగా మంగళవారం సాయంత్రం నాయబ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు.

    హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంగళవారం ఉదయం మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆమోదించారు.

    మంగళవారం సాయంత్రం నాయబ్ సైనీతో పాటు కన్వర్ పాల్ సింగ్ గుర్జార్, మూల్‌చంద్ శర్మ, రంజిత్ సింగ్ చౌతాలా, జై ప్రకాష్ దలాల్, డా. బన్వారీ లాల్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    నాయబ్ సైనీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

    "హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నాయబ్ సింగ్ సైనీకి అభినందనలు. హరియాణా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన చేసిన కృషికి అభినందనలు'' అని ఎక్స్ (ట్విటర్)లో మోదీ పోస్టు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

    హరియాణా లోక్‌హిత్ పార్టీ (హెచ్‌ఎల్‌పీ)కి చెందిన ఎమ్మెల్యే గోపాల్ కందా, మరో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా బీజేపీకి ఉంది కాంగ్రెస్‌కు 30 మంది, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

  5. గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?

  6. ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?

  7. భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?

  8. హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

    హరియాణా కొత్త సీఎం

    ఫొటో సోర్స్, @BJP4Haryana

    హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని హరియాణా బీజేపీ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

    నాయబ్ సింగ్ సైనీని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు, మంగళవారం సాయంత్రం ఐదుగంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఈ పోస్టు తెలిపింది.

    నాయబ్ సింగ్ సైనీ పార్టీ శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.

    మరో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ లాల్ మిదా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘నాయబ్ సింగ్ సైనీ హరియాణా తరువాత ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలవడానికి వెళుతున్నాం’’ అని చెప్పారు.

  9. సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?

  10. ఎంపీ వద్దు, ఎమ్మెల్యేనే కావాలని నేతలు ఎందుకు పట్టుబడుతున్నారు?

  11. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ రాజీనామా

    మనోహర్ లాల్ ఖట్టర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మనోహర్ లాల్ ఖట్టర్

    హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఖట్టర్‌తోపాటు ఆయన మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్ బండారు దత్తాత్రేయకు వారి రాజీనామా లేఖలు అందజేశారు.

    బీజేపీ నాయకుడు కన్వర్ పాల్ గుర్జర్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ- ఖట్టర్ రాజీనామాను ధ్రువీకరించారు.

    రాజీనామాకు ముందు చండీగఢ్‌లో బీజేపీ నాయకులతో ఖట్టర్ సమావేశమయ్యారు.

    2019 ఎన్నికల తర్వాత హరియాణాలో జన్‌నాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దుష్యంత్ చౌతాలా ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

    హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హరియాణా లోక్‌హిత్ పార్టీ(హెచ్‌ఎల్‌పీ) ఎమ్మెల్యే గోపాల్ కందా, ఐదుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది.

    జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

    కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

  12. ఆంధ్రప్రదేశ్: టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఖరారైన సీట్ల పంపకం

    టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు సమావేశం

    ఫొటో సోర్స్, @JanaSenaParty

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలైంది.

    సీట్ల పంపకం వివరాలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాయి.

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పురోగతికి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని ఈ మూడు పార్టీలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. దేశం పురోగతి సాధిస్తూ, అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం వికసించాలని, ఇది తమ ప్రగాఢ ఆకాంక్ష అని చెప్పాయి.

    సీట్ల పంపకం ఒప్పందం ప్రకారం.. తెలుగుదేశం 17 లోక్‌సభ సీట్లు, 144 అసెంబ్లీ సీట్లలో పోటీచేస్తుంది.

    జనసేన రెండు లోక్‌సభ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లలో తలపడనుంది.

    బీజేపీ ఆరు లోక్‌సభ సీట్లలో, పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది.

    ఏ సీట్లలో ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారనేది ఆయా పార్టీలు నిర్ణయిస్తాయని చెప్పాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దిల్లీలో మూడు పార్టీల మధ్య సాగిన సమావేశాలతో పొత్తు ఖరారైనట్లు ఈ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ క్రమంలోనే సోమవారం అమరావతిలో మూడు పార్టీల నాయకులు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపాయి.

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమిలోని భాగస్వాములు ఉంటారని చెప్పాయి.

    సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే తాము తొలి ప్రాధాన్యం ఇచ్చామని, ఈ చర్చలతో రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని చెప్పాయి.

  13. ఏపీ: నేడు రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం, ఒకటి పూరి-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య..

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

    ఫొటో సోర్స్, ANI

    ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.

    వాటిలో రెండు రైళ్లు విశాఖపట్నం గుండా ప్రయాణించనున్నాయని డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ చెప్పారు.

    ఒకటి పూరీ-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తుందని తెలిపారు.

    పూరీ-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉదయం 9 గంటలకు ప్రధాని వర్చ్యువల్‌గా ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.

    సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే ఒక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది.

    డెహ్రాడూన్, లఖ్‌నవూలను కలుపుతూ తొలి వందేభారత్ రైలును కూడా ఇవాళే ప్రారంభిస్తారు మోదీ.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌నుక్లిక్ చేయండి.