ఎలక్టోరల్ బాండ్లు: ఎస్‌బీఐ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
లైవ్ కవరేజీ
సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
యాదాద్రిలో ‘దళిత, బలహీన వర్గాల’ మంత్రులకు అవమానం జరిగిందా...ఈ వివాదంపై భట్టి విక్రమార్క ఏమన్నారు?
SCAD: రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
జీఎన్ సాయిబాబా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీం

ఫొటో సోర్స్, జీఎన్ సాయిబాబా
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురిని విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మావోయిస్ట్‌లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ- అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద 2014లో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అరెస్ట్ అయి, జైలు పాలయ్యారు.
ఆయన్ను, మరో ఐదుగురుని విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్...హైకోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకమేనని చెప్పినట్లు లైవ్‌లా వెబ్‌సైట్ పేర్కొంది.
వృద్ధులైన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి?
ఎలక్టోరల్ బాండ్లు: రేపటికల్లా వివరాలు ఇవ్వాల్సిందేనని ఎస్‌బీఐకి సుప్రీం కోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, YEARS
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
రేపటి లోగా(మార్చి 12) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఎస్‌బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే, ఈ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం ఐదు గంటల లోపు ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈసీఐను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు తమకు జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఈ నెల 5న ఎస్‌బీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఎలక్టోరల్ బాండ్లపై ఫిబ్రవరి 15న చేపట్టిన విచారణలో, ఇవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చింది. మార్చి 6 కల్లా ఎన్నికల సంఘానికి ఈ బాండ్లకు సంబంధించిన సమాచారాన్నంతా ఎస్‌బీఐ సమర్పించాలని ఆదేశించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బైజూస్: ఒకప్పటి అత్యంత విలువైన స్టార్టప్ అప్పులకుప్పగా ఎలా మారింది
పోప్ ఫ్రాన్సిస్ సూచనను తోసిపుచ్చిన యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters
పోప్ ఫ్రాన్సిస్ సూచనను యుక్రెయిన్ తోసిపుచ్చింది.
గత రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు చెప్పేందుకు రష్యాతో యుక్రెయిన్ చర్చలు జరపాలని పోప్ ఫ్రాన్సిస్ సూచించారు.
తెల్ల జెండాను ఎగరవేసేందుకు యుక్రెయిన్ సాహసం చూపించాలని పోప్ అన్నారు.
అంతర్జాతీయంగా తెల్ల జెండాను కాల్పుల విరామానికి లేదా సరెండర్, చర్చలకు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూచికగా ఉపయోగిస్తారు.
పోప్ వ్యాఖ్యలపై స్పందించిన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులెబా, దేశానికి చెందిన నీలం, పసుపు రంగు జెండాలు తప్ప మరే జెండా ఎగరదని తేల్చి చెప్పారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ కూడా పోప్ సూచనను తోసిపుచ్చారు.
స్విస్ మీడియా సంస్థ ఆర్ఎస్ఐకి ఇచ్చిన పోప్ ఇంటర్వ్యూ ఫిబ్రవరిలో రికార్డయింది. మార్చి 20న ఇది బ్రాడ్‌కాస్ట్ కానుంది.
వార్తా సంస్థ రాయిటర్స్ సమాచారం మేరకు, ఈ ఇంటర్వ్యూలో పోప్,‘‘ పరిస్థితిపై ఒక కన్నేసి, ప్రజల గురించి ఆలోచిస్తూ తెల్ల జెండా ఎగరవేసేందుకు, చర్చలు జరిపేందుకు సాహసం ఉన్న వ్యక్తే బలమైన వ్యక్తి. మీరు ఓడిపోతున్నారని తెలిసినప్పుడు, పరిస్థితులు మీరు అనుకున్నట్లు సాగనప్పుడు, చర్చలు జరిపేందుకు సాహసం చూపాలి’’ అని అన్నారు.
ఆస్కార్ 2024: ఉత్తమ డైరెక్టర్‌గా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్
ఆస్కార్ 2024: రాబర్ట్ డౌనీ జూనియర్‌కు ‘ఉత్తమ సహాయ నటుడు’ పురస్కారం

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఒపెన్‌హైమర్ నుంచి ఉత్తమ సహాయ నటుడు అవార్డును దక్కించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్ సినీ వేడుక ఆస్కార్ అవార్డుల ప్రదానం లాస్ ఏంజెలిస్‌లో జరుగుతోంది.
లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్ వద్ద యునైటెడ్ స్టేట్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ వేడుకను నిర్వహిస్తోంది.
ఎప్పటి కంటే గంట ముందే ఈ వేడుక ప్రారంభమైంది. కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2023లో విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్' 13 నామినేషన్స్ దక్కించుకుంది. అంతేకాదు బార్బీ సినిమా కూడా ఎనిమిది విభాగాల్లో పోటీలో నిలిచింది.
ఒపెన్‌హైమర్ నుంచి ఉత్తమ సహాయ నటుడు అవార్డును రాబర్ట్ డౌనీ జూనియర్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో అటమిక్ ఎనర్జీ కమిషన్‌కు చైర్మన్ పాత్ర పోషించారు.
అంతకుముందు రెండుసార్లు ఆయన ఆస్కార్ నామినేషన్లలో నిలిచారు. 2009లో ట్రోపిక్ థండర్(ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ), 1993లో చాప్లిన్(టైటిల్ రోల్) సినిమాలకు గాను ఆయన ఆస్కార్‌కు నామినేటెడ్ అయ్యారు.
ఒపెన్‌హైమర్ చిత్రానికి ఆయనకు తొలి ఆస్కార్ అవార్డు దక్కింది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేయండి.
