మిస్ వరల్డ్-2024 విజేతగా చెక్ రిపబ్లిక్ అమ్మాయి క్రిస్టినా పిస్కోవా
చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1996 తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ పోటీల్లో విజేతను శనివారం అర్ధరాత్రి ఖరారు చేశారు. ముంబయిలో ఫైనల్ పోటీలు జరిగాయి.
లైవ్ కవరేజీ
వృద్ధులైన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి?
, ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
విజయనగరంలో పట్టాలు తప్పిన 'విశాఖపట్నం-భవానీపట్నం' ప్యాసింజర్ రైలు

ఫొటో క్యాప్షన్, కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద సాయంత్రం రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద సాయంత్రం ఘటన జరిగింది.
రైలు లైన్ మారుతుండగా ఇంజిన్ పట్టాలు తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది, ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.
డే లైట్ సేవింగ్స్: గడియారంలో ఓ గంట ముందు, వెనకలకు జరిపితే ప్రాణాలకు ప్రమాదమా, ఈ విధానాన్ని కొన్ని దేశాలు ఎందుకు వద్దంటున్నాయి?
నేడే ఆస్కార్ అవార్డుల ప్రకటన, ఈ ఏడాది వేడుక ప్రత్యేకతలివే...
పశ్చిమబెంగాల్: మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, @AITCofficial
లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మొత్తం 42 సీట్లకుగాను అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
గతంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే, అది కూడా తన నివాసంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన మమతా బెనర్జీ ఈసారి అందుకు భిన్నంగా ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.
దీంతో ఇండియా కూటమిలో సభ్యురాలైన తృణమూల్ కాంగ్రెస్, ఆ కూటమితో ఎలాంటి పొత్తులు, సర్దుబాట్లు జరగక ముందే అభ్యర్ధులను జాబితాను ప్రకటించినట్లయింది.
సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వారిలో 7 గురికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆ పార్టీ నేత మహువా మొయిత్రాకు మరోసారి సీటు దక్కింది. అలాగే క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసఫ్ పఠాన్‌ను కూడా మమత లోక్‌సభ బరిలో దింపారు.
మహువా మొయిత్రా కృష్ణా నగర్ నుంచి పోటీ చేయనుండగా, యూసుఫ్ పఠాన్ బహ్రంపూర్ నుంచి బరిలోకి దిగుతారు. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అయిన అధీర్ రంజన్ చౌధురి మీద పోటీ చేయనున్నారు.
తృణమూల్ అభ్యర్ధులుగా టిక్కెట్లు పొందినవారిలో మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్, నటుడు శత్రుఘ్న సిన్హా తదితరులు ఉన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ఇండియా కూటమితో చర్చించకుండానే మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లోని అన్ని సీట్లకు అభ్యర్దులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
తృణమూల్‌తో సీట్ షేరింగ్ విషయంలో తామెప్పుడూ సానుకూలంగానే ఉన్నామని, చర్చల ద్వారా సీట్ల పంపకం వ్యవహరాలను చక్కబెట్టుకోవచ్చని, కానీ మమతా బెనర్జీ ఏ ఒత్తిడితో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తమకు అర్ధం కావడం లేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆస్కార్ అవార్డుల్లో 13 నామినేషన్లు దక్కించుకున్న ఒపెన్‌హైమర్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఓపెన్ హైమర్ చిత్రం 96వ ఆస్కార్ అవార్డులకు అకాడమీ నామినేషన్స్‌ను ప్రకటించింది.
2023లో విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్' 13 నామినేషన్స్ దక్కించుకుంది. నోలన్ తీసిన సినిమాలు గతంలో ఐదుసార్లు నామినేషన్లలో చోటు దక్కించుకున్నా, ఆస్కార్ రాలేదు. అంతేకాదు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఆయన రెండో సారి నామినేషన్ దక్కించుకున్నారు. 2018లో డంక్రిక్ సినిమాకు గానూ నోలన్‌కు నామినేషన్ దక్కింది.
ఇక 96వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ చిత్రం కేటగిరీలో బార్బీ, ఒపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పూర్ థింగ్స్ తో పాటు మరో ఆరు చిత్రాలు బరిలో నిలిచాయి.
ఉత్తమ దర్శకులుగా క్రిస్టోఫర్ నోలన్ (ఒపెన్‌హైమర్), జస్టిన్ ట్రైట్ ( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యార్గోస్ లాంతిమోస్ (పూర్ థింగ్స్) జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లు నిలిచారు.
ఉత్తమ నటి విభాగంలో అనెట్టే బెనింగ్ (న్యాడ్), లిలీ గ్లాడ్ స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), శాండ్రా హల్లర్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), కేరీ ముల్లిగాన్ (మాయెస్ట్రో), ఎమ్మా స్టోన్- (పూర్ థింగ్స్)లకు చోటు దక్కింది.
ఉత్తమ నటుల విభాగంలో బ్రాడ్లే కూపర్ (మాయెస్ట్రో), కోల్మన్ డొమింగో (రస్టిన్), పాల్ గియామాటి (ది హోల్డోవర్స్), సిలియాన్ మర్ఫీ (ఒపెన్‌హైమర్), జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్)లకు నామినేషన్లలో చోటు దక్కింది.
2024 మార్చి 10వ తేదీన ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.
ఎన్డీయేలోకి టీడీపీ: నరేంద్ర మోదీపై చంద్రబాబు స్వరం ఎలా మారుతూ వచ్చింది?
తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పాటను ఆయుధంగా చేసుకున్న మహిళలు
బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి
దిల్లీ: 40 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయిన చిన్నారి

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, బోరు బావిలో పడిపోయిన చిన్నారి కేశవపూర్ మండికి సమీపంలోని దిల్లీ జల్ బోర్డు ప్లాంట్ లోపలున్న 40 అడుగుల లోతైన బోరు బావిలో ఒక చిన్నారి పడిపోవడంతో రక్షించేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
ఎన్‌డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఛార్జ్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు ఈ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
చిన్నారి పడిపోయిన బోరు బావి పక్కనే కొత్తగా బోరు బావిని తవ్వుతూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

ఫొటో సోర్స్, eci
సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి స్వీకరించారు.
వచ్చే వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
శనివారం జారీ అయిన గెజిట్‌లో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని పేర్కొన్నారు.
అరుణ్ గోయల్, భారత ఎన్నికల కమిషనర్‌గా 2022 నవంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు.
1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్, భారత ప్రభుత్వానికి 37 ఏళ్ల పాటు సేవలు అందించారు.
స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా

ఫొటో సోర్స్, ANI
చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీల్లో విజేతగా నిలిచారు.
1996 తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ పోటీల్లో విజేతను శనివారం అర్ధరాత్రి ఖరారు చేశారు. ముంబయిలో ఫైనల్ పోటీలు జరిగాయి.
మిస్ వరల్డ్ కిరీటాన్ని క్రిస్టినా అందుకోగా, మొదటి రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన యాస్మిన్ అజైటౌన్, రెండో రన్నరప్‌గా ట్రినిడాట్ అండ్ టుబాగోకు చెందిన అచే అబ్రహాంస్ నిలిచారు.
భారత్ నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న కన్నడ అమ్మాయి సిని శెట్టి టాప్-8లో నిలిచారు.
28 ఏళ్ల తర్వాత భారత్‌లో జరిగిన ఈ పోటీలకు దిల్లీలోని భారత మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికలుగా నిలిచాయి.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
