ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్‌లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
‘‘చర్చల్లో మూడు పార్టీలకు పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి." అని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్‌లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌లు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాతో సమావేశమయ్యారు. చర్చల్లో మూడు పార్టీలకు పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి." అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పొత్తుకు సంబంధించి ఈ మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ ఆఫీసు నుంచి ఒక సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది.

ఫొటో సోర్స్, BJP
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓడించింది భారత జట్టు.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేయగా, భారత్ 477 పరుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 195 పరుగులకే ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ ఒక్కరే అత్యధికంగా 84 పరుగులు చేశారు.
భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును కట్టడి చేశారు. ఆర్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి, మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను గెల్చుకుంది.

ఫొటో సోర్స్, ANI
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో చివరిదైన అయిదో టెస్టులో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 23 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.
భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది.
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు.
ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (2), ఓలీ పోప్ (19)తో సహ కెప్టెన్ బెన్ స్టోక్స్ (2) వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి.
బెయిర్‌స్టో (39)ను కుల్దీప్ అవుట్ చేశాడు.
క్రీజులో జో రూట్ (35 బ్యాటింగ్), బెన్ ఫోక్స్ (1 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 473/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 477 పరుగులకు ఆలౌటైంది.
దీంతో భారత్‌కు 259 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ వికెట్ తీయడం ద్వారా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
భారత ఆర్మీ జేసీవో కోసమ్ ఖేడా సింగ్ (40)ను కొందరు అజ్ఞాత సాయుధులు ఆయన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని శుక్రవారం మణిపుర్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన ప్రకారం, సెలవుల మీద థౌబాల్ జిల్లాలోని తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు.
ఆర్మీ అధికారి ఖేడా సింగ్ అపహరణ తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాక్‌చింగ్‌లోని వైఖోంగో ప్రాంతంలో భద్రతా బలగాలు ఆయనను రక్షించాయి.
ఈ ఘటనపై దర్యాప్తు కోసం పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.

దిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారిని ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు మీద చాలామంది నమాజ్ చేస్తోండగా పోలీస్ ఒకరు వచ్చి కాలితో తన్నుతూ వారిని అక్కడ నుంచి వెళ్లమనడం వీడియోలో కనిపిస్తుంది.
పోలీస్ అధికారి తీరును నిరసిస్తూ అక్కడే ఉన్న పలువురు స్థానికులు వాదనకు దిగడం కూడా వీడియోలో చూడొచ్చు.
ఈ ఘటన తర్వాత మెట్రో స్టేషన్ పరిసరాల్లో ప్రజలు గుమిగూడారు. నిరసనలు చేపట్టారు.
అనంతరం నమాజ్ చేస్తోన్న వారిపట్ల అనుచితంగా ప్రవర్తించిన దిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ తోమర్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ ఘటనకు బాధ్యుడిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినట్లు దిల్లీ పోలీస్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.