లోక్‌సభ ఎన్నికలకు 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా, వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ

మొదటి లిస్ట్‌లో 15 జనరల్, 24 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. మొదటి జాబితాలో రాహుల్ గాంధీ పేరు ప్రకటించారు. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి మరోసార పోటీ చేస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. రూపర్ట్ మర్దోక్: 92 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న మీడియా దిగ్గజం, ఈ జంట కథ ఇదీ..

  3. బియ్యం, గోధుమలు? ఏవి తింటే శరీరానికి మంచిది

  4. లోక్‌సభ ఎన్నికలకు 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణలో నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

    కేసీ వేణుగోపాల్

    ఫొటో సోర్స్, congress

    లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 39 మందితో తొలి జాబితా విడుదల చేసింది.

    పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిల్లీలో ఆ వివరాలు వెల్లడించారు.

    15 జనరల్, 24 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. మొదటి జాబితాలో రాహుల్ గాంధీ పేరు ప్రకటించారు. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి మరోసార పోటీ చేస్తున్నారు.

    మొదటి లిస్ట్‌లో తెలంగాణలో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

    తెలంగాణలో జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్(ఎస్టీ) నుంచి బలరాంనాయక్, మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించారు.

    congress first list for 2024 loksabha elections

    ఫొటో సోర్స్, congress

  5. రూపా వైరాప్రకాశ్: మరుగుజ్జువు నువ్వేం చేయగలవంటే.. ఏకంగా పారాలింపిక్స్‌లో బంగారు పతకంతో తిరిగొచ్చారు

  6. భీమా రివ్యూ: గోపీచంద్‌లో హుషారు తగ్గలేదు.. మరి సినిమాలో ఏం తక్కువైంది?

  7. ఉద్యోగాల పేరుతో రష్యా యుద్ధంలోకి భారతీయులు, ఏజెంట్ల నెట్‌వర్క్ ఛేదించిన సీబీఐ

    రష్యా, యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ యుద్ధం

    ఉద్యోగాల పేరుతో భారతీయులను రష్యాకు పంపుతూ మోసం చేస్తున్న ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా జనాలను ఆకర్షిస్తూ, మోసం చేస్తున్నారని సీబీఐ తెలిపింది.

    ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉందని, ఇప్పటివరకు దాదాపు 35 మంది ఈ రాకెట్‌కు బలయ్యారని ఏజెన్సీ తెలిపింది.

    రష్యాకు వెళ్లిన ఇద్దరు భారతీయులు యుద్ధంలో మరణించిన తర్వాత ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఇదేవిధంగా మాస్కోకు వెళ్లారు.

    ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''రూ.1,50,000 నెలవారీ జీతం ఇస్తానని హామీ ఇస్తూ రష్యాకు తీసుకొచ్చారు. మేం సైన్యంలోకి వెళుతున్నామని మాకు చెప్పలేదు'' అని తెలిపారు.

    వీసా కన్సల్టెన్సీలు, ఏజెంట్లపై కేసులు

    ట్రాఫికర్లు ‘వ్యవస్థీకృత నెట్‌వర్క్’ కింద పనిచేస్తున్నారని సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఏజెంట్లు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఛానెల్స్, స్థానిక పరిచయాలతో రష్యాలో "లాభదాయకమైన ఉద్యోగాలు" ఇప్పిస్తామంటూ యువతను ఆకర్షిస్తున్నారని పేర్కొంది.

    దిల్లీ, ముంబయి సహా దేశంలోని 13 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి, అనేక ప్రైవేట్ వీసా కన్సల్టెన్సీ సంస్థలు, ఏజెంట్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

    పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ. 50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.

    గత కొన్ని నెలలుగా రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది.

    రష్యా ఆర్మీ నుంచి భారత పౌరులను తీసుకురావడానికి ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత పౌరులందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, ఈ మోసం నుంచి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

  8. గణేష్ బారయ: ఎంబీబీఎస్ సీటు కోసం ఎంసీఐపై పోరాడి గెలిచిన ‘మూడు అడుగుల’ డాక్టర్ కథ

  9. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి

    సుధామూర్తి

    ఫొటో సోర్స్, Getty Images

    రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.

    ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.

    సామాజిక సేవ, విద్య, దాతృత్వం వంటి విభిన్న రంగాల్లో ఆమె చేసిన సేవ స్ఫూర్తిదాయకమని మోదీ ప్రశంసించారు.

    రాజ్యసభకు ఆమె నామినేట్ కావడం నారీ శక్తికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు.. ఆధిక్యంలో భారత్

    భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్

    ఫొటో సోర్స్, ANI

    హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న అయిదో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలు చేశారు.

    రోహిత్ 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులను పూర్తి చేయగా, గిల్ 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ అందుకున్నాడు.

    వీరిద్దరు 100 పరుగుల మైలురాయిని అందుకున్న తర్వాత భారత్ లంచ్‌ విరామం తీసుకుంది.

    లంచ్ తర్వాత కాసేపటికే రోహిత్, గిల్ అవుట్ అయ్యారు. నాలుగు పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ ఈ రెండు వికెట్లను పడగొట్టింది. స్టోక్స్ బౌలింగ్‌లో 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ, అండర్సన్ బౌలింగ్‌లో 110 పరుగుల వద్ద గిల్ బౌల్డ్‌ అయ్యారు.

    గిల్ అవుటయ్యే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 62.2 ఓవర్లలో 279/3.

    అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులు చేసింది.

    ఐదు మ్యాచుల ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే గెలుచుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. కెనడా: శ్రీలంక కుటుంబంలో తల్లిని, నలుగురు పిల్లలను చంపిన విద్యార్థి

  12. సమాధి నిండా బంగారం, నరబలి ఆధారాలు

  13. మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 100 తగ్గింపు

    సిలిండర్ ధర తగ్గింపు

    ఫొటో సోర్స్, Getty Images

    మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం, ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    వంట గ్యాస్‌ను తక్కువ ధరకు అందించడం ద్వారా కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యకర వాతావరణానికి మద్దతుగా నిలవాలనుకున్నాం అని చెప్పారు.

    మహిళా సాధికారత, వారికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. మానవతా సహాయం అందించేందుకు గాజాలో తాత్కాలిక నౌకాశ్రయాన్ని నిర్మించనున్న అమెరికా

    గాజాలో మానవతా సహాయం

    ఫొటో సోర్స్, Getty Images

    సముద్ర మార్గం ద్వారా మానవతా సహాయాన్నిపంపించేందుకు గాజాలో అమెరికా మిలిటరీ ఒక తాత్కాలిక నౌకాశ్రయాన్ని నిర్మిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించనున్నారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

    ఈ తాత్కాలిక నౌకాశ్రయంతో పాలస్తీనా ప్రజలకు అందే మానవతా సహాయం రోజుకు అదనంగా వందల ట్రక్కుల మేర పెరుగుతుందని చెప్పారు.

    గాజాలోని పావు వంతు జనాభా కరవు అంచున ఉన్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

    పోర్టు నిర్మాణానికి కొన్ని వారాల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ఆహారం, ఔషధాలను తీసుకొచ్చే భారీ నౌకలు ఈ పోర్టు వద్ద ఆగుతాయని తెలిపారు. సైప్రస్ నుంచి తొలి విడత సరఫరాలు ఈ పోర్టుకు వస్తాయన్నారు.

    ఈ అంశాన్ని ‘స్టేట్ ఆఫ్ ద యూనియన్’ ప్రసంగంలో బైడెన్ ప్రకటించనున్నారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  16. పాలు ఎవరు తాగొచ్చు? ఎవరు తాగకూడదు?

  17. కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?