గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌: వాణిజ్య నౌకపై హూతీల క్షిపణి దాడి.. ముగ్గురు నావికులు మృతి

గాజాలో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతుగా హూతీలు వాణిజ్య నౌకలపై దాడులు జరుపుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. గీతాంజలి మరణం: సోషల్ మీడియా ట్రోలింగ్ మహిళల ప్రాణాలను తీసే స్థాయికి చేరుతోందా?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. జైలు నుంచి ప్రాణాలతో బయటకు రావడం ఆశ్చర్యంగానే ఉంది-సాయిబాబా

    ప్రొఫెసర్ సాయిబాబా

    ఫొటో సోర్స్, ANI

    మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా తేలిన దిల్లీ యూనివర్సిటీ మాజీ ఫ్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.

    జైలు నుంచి బయటకు వస్తారని అనుకున్నారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, “ఆ ఆశే నన్ను ఇక్కడి దాకా తీసుకునివచ్చింది. సజీవంగా జైలు నుంచి బయటకు రావడం ఆశ్చర్యంగానే ఉంది” అన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ “కనీసం 50 శాతం రాజ్యాంగాన్ని అమలు చేసినా దేశంలో మార్పు వచ్చి ఉండేది. నాకు ఆ నమ్మకముంది” అన్నారు.

    మార్చి 5న బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతోపాటు కేసులో నిందితులుగా పేర్కొన హేమ్ మిశ్రా, మహేశ్ టిర్కి, విజయ్ టిర్కి, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహీ, పాండూ నరోత్ (చనిపోయారు)లను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?

  5. డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1 లక్ష స్టైఫండ్‌తో అప్రెంటిస్‌ ఉద్యోగాలు- రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1 లక్షతో అప్రెంటిస్ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

    ఎక్స్ వేదికగా “గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా పూర్తి చేసిన తొలి ఏడాదిలోగా 12 నెలల పాటు రూ.1 లక్ష స్టైఫండ్‌తో ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలో అప్రెంటిస్‌షిప్ లభించేలా ‘రైట్ టూ అప్రెంటిస్ యాక్ట్’ను అమలు చేస్తాం” అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా దాహోడ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, దేశంలోని యువతకు ఉద్యోగాలు లభించే పరిస్థితి కనిపించడంలేదని అన్నారు.

    కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ విమర్శలు చేశారు.

    దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మోదీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలుత ఉద్యోగాల భర్తీ చేపడతామని అన్నారు రాహుల్ గాంధీ.

    “దేశంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దేశంలోని యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ఇది నిజం. మొదటి సమస్య నిరుద్యోగమైతే, రెండో సమస్య ద్రవ్యోల్బణం” అన్నారు.

    ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాకపోవడాన్ని మరోసారి ప్రస్తావించారు రాహుల్ గాంధీ.

    “రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించారు. ఎవరికైనా దేశ రాష్ట్రపతి కనిపించారా? ఆమె ఏం తప్పు చేశారని? ఆదివాసీ మహిళ అని, ఆలయంలో ప్రవేశానికి వీలు కల్పించలేదు. ఆలయంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. రైతులు, కార్మికులు ఉన్నారు. కానీ, దళితులు, ఆదివాసీలు మీకు కనిపించారా? బాలీవుడ్‌కు చెందిన వారు కనిపించారు కానీ, పేదవారు ఒక్కరైనా కనిపించారా?” అని ప్రశ్నించారు.

  6. రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

  7. రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు

  8. మహా శివరాత్రి: పురుషాంగం ఆకారంలో విగ్రహం.. తిరుపతి సమీపంలో అరుదైన శివాలయం

  9. విద్యార్థిని తుపాకీతో కాల్చిన లెక్చరర్‌

  10. పాలు ఎవరు తాగొచ్చు? ఎవరు తాగకూడదు?

  11. రష్యాలో మృతిచెందిన భారతీయుడి వివరాలు తెలిపిన ఎంబసీ

    భారత రాయబారా కార్యాలయం

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాలో మృతిచెందిన భారత పౌరుడి పేరు మహ్మద్ అస్ఫన్‌గా ఎంబసీ వెల్లడించింది.

    ఈ సమాచారం గురించి తెలియజేస్తూ, రష్యాలోని భారత ఎంబసీ కార్యాలయం ట్వీట్ చేసింది.

    "భారత పౌరుడు మహ్మద్ అస్ఫన్ మరణానికి చింతిస్తున్నాం. అతడి కుటుంబ సభ్యులతోనూ, రష్యా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అస్ఫన్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు కృషి చేస్తున్నాం" అని ట్వీట్‌లో పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అంతకుముందు, ఇజ్రాయెల్‌లో జరిగిన హిజ్బుల్లా దాడుల్లో భారత పౌరుడు మరణించారు. అదే దాడిలో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ముగ్గురూ కేరళకు చెందిన వారుగా చెప్తున్నారు.

    రష్యాలో భారతీయుడి మరణం గురించి వార్తలు వచ్చిన సమయంలో ది హిందూ పత్రిక ప్రచురించిన కథనంలో, రష్యాలో ఉద్యోగాలంటూ కొంతమందిని భారత్ నుంచి తీసుకువెళ్లి, సైన్యంలో చేర్చారని రాసింది.

    దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, రష్యాకు వెళ్లిన వారిని తిరిగి తీసుకువచ్చేందుకు రష్యా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

    ఫిబ్రవరి 29న భారత విదేశీ వ్యవహారాల శాఖ తొలిసారిగా విడుదల చేసిన ప్రకటనలో 20 మందికి పైగా భారతీయులు తమను భారత్ పంపేందుకు సాయం కోరుతూ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపింది.

  12. అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?

  13. యూపీ: ‘లైంగిక దాడి’ అవమానంతో బాలికల ఆత్మహత్య.. మనస్తాపంతో ఒక బాధితురాలి తండ్రి బలవన్మరణం

    తండ్రి ఆత్మహత్య

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 50 ఏళ్ళ వ్యక్తి శవమై చెట్టుకు వేలాడుతూ కనిపించారు. గత నెలలో ఇద్దరి మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ (సామూహిక లైంగిక దాడి) జరిగింది. ఈ ఘటన తరువాత వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం చనిపోయిన వ్యక్తి ఈ ఇద్దరి మైనర్లలో ఓ బాలికకు తండ్రి.

    మృతుని వద్ద సూసైడ్ నోట్ లభించలేదని, అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఈయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.

    లైంగిక దాడికి గురైన బాలికలిద్దరూ ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. ఈ బట్టీ కాంట్రాక్టర్, ఆయన అనుచరులు కలిసి, 14, 16 ఏళ్ళున్న ఈ ఇద్దరు బాలికలపై కిందటి నెలలో లైంగిక దాడికి పాల్పడ్డారు.

    రేప్ చేసిన తరువాత ఈ బాలికలను వీడియో తీయడంతో బాలికలు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఈ బాలికల్లో ఒకరి తండ్రి తన ఇంటికి సమీపంలో ఓ చెట్టు వద్ద ఉరివేసుకున్నారని,ఈ ఘటన సిసోలర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగినట్టు హమీర్పుర్ ఎస్పీ దీక్షాశర్మ చెప్పారు.

    బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు, వారి ఆత్మహత్యకు సంబంధించి ఇటుక బట్టీల కాంట్రాక్టర్, అతని కుమారుడిని, మేనల్లుడిని కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

    సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

    నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్: 08026995000

  14. గాజా: ఆకాశం నుంచి ఆహారం జారవిడవడంపై వివాదం ఎందుకు?

  15. జైలు నుంచి విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా

    కారాగారం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి...

    ఫొటో సోర్స్, Ramky

    కారాగారం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి

    ఫొటో సోర్స్, Ramky

    నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విడుదలైనట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది.

    మావోయిస్టులతో సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది.

    సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధరిస్తూ 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 5న కొట్టివేసింది.

    మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకొనే వరకు రూ. 50,000 పూచీకత్తుతో నిందితులను బెయి‌ల్‌పై విడుదల చేయవచ్చని తీర్పు ఇచ్చింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపించే అద్భుతమైన 8 ఇళ్లు.. వీటిలో ఒకటి జైపుర్‌లో!

  17. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌: వాణిజ్య నౌకపై హూతీల క్షిపణి దాడి.. ముగ్గురు నావికులు మృతి

    కార్గో షిప్ ఇమేజ్‌ను విడుదల చేసిన అమెరికా సెంట్రల్ కమాండ్

    ఫొటో సోర్స్, CENTCOM

    ఫొటో క్యాప్షన్, కార్గో షిప్ ఇమేజ్‌ను విడుదల చేసిన అమెరికా సెంట్రల్ కమాండ్

    దక్షిణ యెమెన్‌లో వాణిజ్య నౌకపై హూతీలు చేసిన క్షిపణి దాడిలో ముగ్గురు నౌక సిబ్బంది మృతి చెందినట్లు అమెరికా అధికారులు చెప్పారు.

    వాణిజ్య నౌకలపై హూతీలు చేస్తున్న దాడుల్లో తొలిసారి ఈ మరణాలు నమోదయ్యాయి.

    యెమెన్ ఓడరేవు ఏడెన్ తీర ప్రాంతం నుంచి సుమారు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్‌కు చెందిన ట్రూ కాన్ఫిడెన్స్‌ నౌకపై దాడి జరిగినట్లు నౌక యజమానుల అధికార ప్రతినిధి, మేనేజర్లు చెప్పారు.

    గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో 11.30 జీఎంటీ కాలమానం ప్రకారం ఈ నౌకపై దాడి జరిగిందని అమెరికా సైన్యం తెలిపింది.

    బుధవారం జరిగిన ఈ దాడికి హూతీ గ్రూప్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. తాము చేసిన హెచ్చరికలను ట్రూ కాన్ఫిడెన్స్‌కు చెందిన సిబ్బంది పెడచెవిన పెట్టారని ఈ గ్రూప్ పేర్కొంది.

    గాజాలో ఇజ్రాయెల్-హమాస్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఈ దాడులు జరుపుతున్నట్లు హూతీ గ్రూప్ చెప్పింది.

    హూతీలు జరిపిన ఈ దాడిలో ముగ్గురు నౌకా సిబ్బంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు మధ్యప్రాచ్యంలో వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించే అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. గాయాలపాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది.

    నౌకలపై హూతీల దాడుల వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటోంది. అంతేకాకుండా అంతర్జాతీయ నౌకల సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  19. పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?