రష్యాలో మృతిచెందిన భారతీయుడి వివరాలు తెలిపిన ఎంబసీ

రష్యాలో మృతిచెందిన భారత పౌరుడి పేరు మహ్మద్ అఫ్సన్‌గా ఎంబసీ వెల్లడించింది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. రష్యాలో మృతిచెందిన భారతీయుడి వివరాలు తెలిపిన ఎంబసీ

    భారత రాయబారా కార్యాలయం

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాలో మృతిచెందిన భారత పౌరుడి పేరు మహ్మద్ అస్ఫన్‌గా ఎంబసీ వెల్లడించింది.

    ఈ సమాచారం గురించి తెలియజేస్తూ, రష్యాలోని భారత ఎంబసీ కార్యాలయం ట్వీట్ చేసింది.

    "భారత పౌరుడు మహ్మద్ అస్ఫన్ మరణానికి చింతిస్తున్నాం. అతడి కుటుంబ సభ్యులతోనూ, రష్యా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అస్ఫన్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు కృషి చేస్తున్నాం" అని ట్వీట్‌లో పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అంతకుముందు, ఇజ్రాయెల్‌లో జరిగిన హిజ్బుల్లా దాడుల్లో భారత పౌరుడు మరణించారు. అదే దాడిలో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ముగ్గురూ కేరళకు చెందిన వారుగా చెప్తున్నారు.

    రష్యాలో భారతీయుడి మరణం గురించి వార్తలు వచ్చిన సమయంలో ది హిందూ పత్రిక ప్రచురించిన కథనంలో, రష్యాలో ఉద్యోగాలంటూ కొంతమందిని భారత్ నుంచి తీసుకువెళ్లి, సైన్యంలో చేర్చారని రాసింది.

    దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, రష్యాకు వెళ్లిన వారిని తిరిగి తీసుకువచ్చేందుకు రష్యా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

    ఫిబ్రవరి 29న భారత విదేశీ వ్యవహారాల శాఖ తొలిసారిగా విడుదల చేసిన ప్రకటనలో 20 మందికి పైగా భారతీయులు తమను భారత్ పంపేందుకు సాయం కోరుతూ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపింది.

  3. మాల్దీవులు: చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ముయిజ్జు, భారత్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే...

  4. జై ఖామ్కర్: ‘నాకు కళ్లు లేవు... కానీ, గుడ్డిదాన్ని కాదు’

  5. పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?

  6. ఇథియోపియా ప్రజలు క్రైస్తవ మతంలో ఆర్థడాక్స్ శాఖకు ఎందుకు దూరమవుతున్నారు?

  7. 'డ్రై-ఐస్' తిన్న తరువాత నోట్లోంచి రక్తం పడింది... గురుగ్రామ్ రెస్టారెంట్లో అసలేం జరిగింది?

  8. మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతి వేసి రికార్డు సృష్టించిన షబ్నీమ్ ఇస్మాయిల్

    ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ షబ్నీమ్ ఇస్మాయిల్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ షబ్నీమ్ ఇస్మాయిల్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ షబ్నీమ్ ఇస్మాయిల్ 'మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌'గా రికార్డు సృష్టించారు.

    మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో ఓవర్ రెండో బంతిని షబ్నీమ్ గంటకు 132.1 కి.మీ.ల వేగంతో బంతిని విసిరారు.

    మ్యాచ్ తర్వాత ఈ రికార్డు గురించి ఆమెను అడిగినప్పుడు, బంతి వేసేటప్పుడు స్క్రీన్‌ను చూడలేదన్నారు.

    అయితే, ఈ మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.

    దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నీమ్ 2023 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యారు.

  9. కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్

  10. మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు

  11. ఇద్దరు రష్యా కమాండర్ల అరెస్టుకు అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్లు

    విక్టర్ సోకోలోవ్ నావికాదళ అడ్మిరల్‌

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, విక్టర్ సోకోలోవ్ రష్యా నేవీ అడ్మిరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

    యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు రష్యా టాప్ కమాండర్లకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్ జారీ అయిన వారిలో సెర్గీ కోబిలాష్ రష్యా ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌గా, విక్టర్ సోకోలోవ్ నేవీ అడ్మిరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

    యుక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా ఉన్నతస్థాయి అధికారులకు ఐసీసీ నుంచి ఇది రెండో రౌండ్ వారెంట్. అంతకుముందు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా పిల్లల హక్కుల కమిషనర్‌లపై వారెంట్ జారీ అయ్యింది. అయితే, ఐసీసీని రష్యా గుర్తించడం లేదు.

    యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలు లక్ష్యంగా జరిపిన క్షిపణి దాడులకు ఈ ఇద్దరూ బాధ్యులని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ఐసీసీ తెలిపింది. ఈ ఘటనలు 2022 అక్టోబర్, 2023 మార్చి మధ్య జరిగినట్లు తెలిపింది.

    ఈ దాడుల వల్ల పౌరులకు నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది. ఇద్దరూ మానవజాతికి వ్యతిరేకంగా అమానవీయ చర్యలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

  12. ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత తొలిసారి ఓటు హక్కు పొందిన గిరిజనాపురం గ్రామస్థులు.. ఈ ఊరి కథేంటి

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  14. కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?