ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, TelanganaGovernment
తెలంగాణ ప్రభుత్వం 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆదివారం జీవోను విడుదల చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.

ఫొటో సోర్స్, TelanganaGovernment

ఫొటో సోర్స్, CG news
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయ్‌ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 స్థానాలు గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఆదివారం కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్వానంద సోనోవల్‌లతోపాటు బీజేపీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఎన్నుకున్నట్లుగా ఏఎన్ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, @vishnudsai
విష్ణు దేవ్ నేపథ్యం..
గిరిజన నాయకుడిగా పేరొందిన విష్ణుదేవ్ సాయ్ 2014లో బీజేపీ తరపున రాయ్‌గఢ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
2020-22 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కుంకరి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి యూడీ మింజ్‌పై 25,541 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక్కడ బీజేపీకి 54 సీట్లు రాగా, 36 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి.
విష్ణు దేవ్ సాయ్ ఏమన్నారంటే..
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విష్ణు దేవ్ సాయ్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘బీజేపీ విధానమైన సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్’కు కట్టుబడి నిజాయితీగా పని చేస్తాను. ‘మోదీ కీ గ్యారెంటీ’లో భాగంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాను” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AKASH ANAND/FB
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.
మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా ప్రకటించినట్లు ఆ పార్టీకి చెందిన నేత ఒకరు తెలిపారు.
షాజహాన్‌పూర్ జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఉదయ్‌వీర్ సింగ్ ఈ ప్రకటనకు సంబంధించి పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ఆకాశ్ ఆనంద్‌ను ఉత్తరాధికారి (వారసుడిగా) ప్రకటించారు మాయావతి. ఆకాశ్ ఆనంద్ ఇకపై ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు నిర్వర్తిస్తారు’’ అని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, BRS party
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ని పరామర్శించారు.
9వ అంతస్తులో చికిత్స పొందుతున్న కేసీఆర్ దగ్గరకు యశోద ఆస్పత్రి యాజమాన్యం దగ్గరుండి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకెళ్లారు. అనంతరం కేటీఆర్ వచ్చి రేవంత్‌ను కేసీఆర్ గదికి తీసుకెళ్లారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని యశోద వైద్యులు, కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డికి వివరించారు.
రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ కూడా ఉన్నారు.
కాగా, కేసీఆర్ తన నివాసంలో కాలు జారి కింద పడటంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు తుంటి ఎముక శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
అంతకుముందు కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, BRS party
అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం..
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో కేసీఆర్ మాట్లాడాలని, త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని కేసీఆర్‌ను కోరినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

మెర్వినాకు ఈ కాప్ సమ్మిట్ ఎంతో ముఖ్యం. అందుకోసం ఆమె 24 గంటలపాటు విమానంలో ప్రయాణించి ఫిజీ నుంచి హాంకాంగ్ మీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చేరుకున్నారు.
'మనందరికీ భూమితో అనుబంధం ఉంది. నా దేశం కోసం ఏం చేసినా అది విలువైనదే' అని ఆమె అన్నారు.
మెర్వినా తువాలు నుంచి వచ్చిన గ్రూపులో ఒకరు, అక్కడి ప్రజలు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సముద్ర మట్టం పెరుగుతున్నందున వారి నివాస ప్రాంతమైన తువాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
గుట్కా కంపెనీల ఉత్పత్తులకు వ్యాపార ప్రకటనలు చేసినందుకు సినిమా నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ధిక్కార పిటిషన్‌పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపిన విషయాన్ని అలహాబాద్ కోర్టులోని లక్నో బెంచ్‌కు తెలియజేసింది.
ఇదే విషయంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతోందని, హైకోర్టులో దాఖలైన అత్యవసర పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టును కోరింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ తేదీని 2024 మే 9గా హైకోర్టు నిర్ణయించింది.
పిటిషినర్ తరఫున వాదించే వారిని నిర్ణయించాలని బెంచ్ జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ అంతకుముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
హై ప్రొఫైల్ అవార్డులు పొందుతూ.. గుట్కా కంపెనీలకు వ్యాపార ప్రకటనలు చేస్తోన్న నటులు, సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌లో 90 శాతం కుంకుమ పువ్వు కశ్మీర్ నుంచి వస్తోంది. శతాబ్దాల నుంచీ ఇక్కడ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎర్ర బంగారం దిగుబడి ఎందుకు తగ్గిపోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
బరేలీ-నైనితాల్ జాతీయ రహదారిపై డంపర్, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 8 మంది సజీవ దహనమయ్యారు.
చనిపోయిన వారిలో చిన్నారి కూడా ఉంది. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
‘జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొంది. ఆ తర్వాత కారు కొంతదూరం ముందుకెళ్లి, మంటల్లో చిక్కుకుపోయింది. కారు సెంట్రల్‌గా లాక్ అయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు బయటికి రాలేక మంటల్లో కాలిపోయారు’’ అని బరేలీ ఎస్‌ఎస్‌పీ గులే సుశిల్ చెప్పారు.
మృతదేహాలను బయటికి తీశామని, చనిపోయిన వారిలో ఏడుగురు పెద్దవాళ్లు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.