LIVE గాజాపై దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్

గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతాలను ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. కానీ దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ రాత్రంతా దాడులు కొనసాగిస్తోంది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. చైనా మూడు నెలల్లో రక్షణ, విదేశాంగ మంత్రులను ఎందుకు తప్పించింది?

  3. పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?

  4. అజయ్ జడేజా: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ విజయం వెనకున్న భారతీయుడు

  5. ‘పాకిస్తాన్‌ను ఓడించాం, ఇక ఆనందంగా ఇంటికి వెళ్తాం’ - అఫ్గానిస్తాన్ ప్రజల సంబరాలు.. తాలిబాన్లు ఏమన్నారు?

  6. వీరపాండ్య కట్టబొమ్మన్‌ తెలుగువారా, బందిపోటు అని ముద్రవేసి ఆయనను ఉరి తీశారా... అపోహలేంటి, వాస్తవాలేంటి?

  7. గాజాపై దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్ పాలస్తీనా

    ఫొటో సోర్స్, PA Media

    గత 24 గంటల్లో గాజాలోని 400కు పైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. అంతకుముందు సోమవారం, ఇజ్రాయెల్ 320 లక్ష్యాలపై దాడి చేసింది.

    ఒకవైపు తాము దాడులు చేస్తున్నా, ఎదురుదాడులకు హమాస్ కూడా సిద్ధమవుతోందని ఐడీఎఫ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తెలిపింది.

    ఇజ్రాయెల్ ప్రధానంగా సొరంగ మార్గాలపై దాడులు చేస్తోంది. హమాస్ రహస్య స్థావరాలతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిన మసీదులు కూడా తమ లక్ష్యాలలో ఉన్నాయని ఐడీఎఫ్ తెలిపింది.

    దక్షిణ ఇజ్రాయెల్‌లో కూడా దాడులు జరుగుతున్నాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతాలను ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. కానీ దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ రాత్రంతా దాడులు కొనసాగిస్తోంది.

  8. తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే...

  9. హమాస్ మిలిటెంట్ల బాడీకామ్ ఫుటేజిని జర్నలిస్టులకు ప్రదర్శించిన ఇజ్రాయెల్...

    గాజా

    ఫొటో సోర్స్, IDF HANDOUT

    రక్తసిక్తమైన పిల్లలిద్దరూ బెదిరిపోయి ఇంట్లోకి వెళ్ళారు. హమాస్ గన్‌మెన్ ఇంట్లోకి వచ్చి తాపీగా వారి ముందే ఫ్రిజ్ తెరిచి కూల్ డ్రింక్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్లో ఒకరు 'నాన్న చనిపోయాడు. ఇది అబద్ధం కాదు' అని తన సోదరుడితో చెబుతూ ఏడుస్తున్నాడు.

  10. మరో ఇద్దరు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్

    ఇజ్రాయెల్ గాజా హమాస్

    ఫొటో సోర్స్, Getty Images

    హమాస్ విడుదల చేసిన ఇద్దరు బందీలు టెల్ అవీవ్ చేరుకున్నారు. వారిద్దరికీ చికిత్స జరుగుతోంది.

    79 ఏళ్ల న్యూరిట్ కూపర్, 85 సంవత్సరాల యెకెవెడ్ లిఫ్‌షిట్జ్‌‌ గత కొన్ని రోజులుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు.

    వారి ఆరోగ్యం దృష్ట్యా మానవతా దృక్పథంతో ఆ ఇద్దరినీ విడుదల చేసినట్లు హమాస్ వెల్లడించింది.

    అయితే కూపర్ భర్త 85 ఏళ్ల అమిరామ్, లిఫ్‌షిట్జ్ భర్త 83 ఏళ్ల ఓడెడ్ ఇప్పటికీ గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

    వీరి విడుదలలో మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టుకు, వారిని టెల్ అవీవ్‌కు చేర్చిన రెడ్ క్రాస్‌ సంస్థకు ఇజ్రాయెల్ కృతజ్జతలు తెలిపింది.

    ఇప్పటి వరకు హమాస్ 4గురు బందీలను విడుదల చేయగా, ఇంకా 200 మందికి పైగా ప్రజలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది.

  11. గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.