లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్ మరో అసాధారణ విజయం సాధించింది. పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకో ఆరు బంతులు మిగిలి ఉండగానే..!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్ మరో అసాధారణ విజయం సాధించింది. పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకో ఆరు బంతులు మిగిలి ఉండగానే..!
సోమవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అప్గానిస్తాన్ 49 ఓవర్లలో రెండే వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది.
113 బంతుల్లో 87 పరుగులు సాధించిన అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జర్దాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
రహ్మనుల్లా గుర్బాజ్(65), రహ్మత్ షా(77), హష్మతుల్లా షాహిది(48) రాణించారు.
ఇంతకుముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్ 69 పరుగుల తేడాతో గెలుపొందింది.
తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అఫ్గానిస్థాన్ ఆరో స్థానానికి చేరింది.
బంగ్లాదేశ్(7), నెదర్లాండ్స్(8), శ్రీలంక(9), ఇంగ్లండ్(10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, JSP
ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ అనే తెగులు పట్టిందని, అందువల్ల టీడీపీ-జనసేన వ్యాక్సీన్ అవసరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు తొలుత భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలని అందుకే టీడీపీ, జనసేన కలిశాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ, జనసేనల సమన్వయ కమిటీ సోమవారం రాజమండ్రిలో సమావేశం నిర్వహించింది. భేటీ అనంతరం పవన్, లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం విపక్ష పార్టీలను, నాయకులను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం చేస్తోందని పవన్ ఆరోపించారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు.
ఎన్డీఏలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించామని, దీనిని బీజేపీ పెద్దలు కూడా అర్థం చేసుకున్నారని పవన్ చెప్పారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాము రాజమండ్రిలో కలిసి, ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామని తెలిపారు. టీడీపీ-జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే దానిపై కూడా మాట్లాడుకున్నామని చెప్పారు.
త్వరలోనే ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని, ఇది 3 విడతలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై తర్వాత జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, JSP
జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపైనే చర్చించామని లోకేశ్ చెప్పారు. రెండు పార్టీల శ్రేణులకు సంబంధించి ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుంటామని, వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యచరణపై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుతానికి సీట్లు, ఓట్లు పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై పోరాటం చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, JSP

ఫొటో సోర్స్, Getty Images
వాఘ్ బక్రి టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(49) అహ్మదాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
పరాగ్ దేశాయ్ మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లినప్పుడు, ఆయన వద్దకు రెండు వీధి కుక్కలు రాబోయాయని, అవి కరుస్తాయేమోనని భయపడి పరిగెత్తిన పరాగ్ దేశాయ్, కింద పడి గాయాలు పాలయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటన అక్టోబర్ 15న జరిగింది.
కింద పడిపోవడంతో ఆయన మెదడులో తీవ్ర రక్తస్రావమైంది.
ఆ తర్వాత పరాగ్ దేశాయ్‌ను ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
పరాగ్ దేశాయ్ కిందపడిపోయి గాయాలు పాలైన విషయాన్ని గార్డు ఆయన ఫ్యామిలీకి తెలియజేశారు. వెంటనే ఆయన్ను షెల్బీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఒక రోజు తర్వాత సర్జరీ కోసం పరాగ్ దేశాయ్‌ను జైడస్ ఆస్పత్రికి తరలించారు.
మెదడులో తీవ్ర రక్త స్రావం అవడంతో పరాగ్ దేశాయ్ మరణించినట్లు తెలిసింది.
పరాగ్ దేశాయ్ మృతిపై గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు.
ఆయనకు 77 ఏళ్లు.
బౌలర్‌గా ఆయన తనదైన ముద్ర వేశారు.
1966 నుంచి 1979 వరకు ఆయన టెస్ట్ క్రికెట్ ఆడారు. 67 టెస్ట్ మ్యాచుల్లో 266 వికెట్లు పడగొట్టారు.
బిషన్ సింగ్ బేడీ అమృత్‌సర్‌లో 1946 సెప్టెంబరు 25న పుట్టారు.
ఆయన మరణం క్రికెట్ ప్రపంచానికి పెద్ద నష్టమని కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
మేడిగడ్డ బ్యారేజీకి చెందిన ఒక పిల్లర్ కుంగిపోవడంతో ఈ బ్యారేజీ పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది.
సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సీఈ అనిల్ జైన్ చైర్మన్‌గా, జల వనరుల నిపుణులు ఎస్‌కే శర్మ, ఆర్ తంగమణి, రాహుల్ కే సింగ్, దేవేంద్ర రావ్ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటుచేశారు. దీనిలో మరో సభ్యుడిని నామినేట్ చేయాల్సి ఉంది.
బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఈ కమిటీ సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతూ గోదావరి నదిపై 1.6 కిలో మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్యారేజీకి 85 గేట్లు ఉన్నాయి. ఒక పిల్లర్ కుంగిపోవడంతో గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో ఆదివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో చాలా మంది ప్రజలు మరణించారని హమాస్ హోం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ఆదివారం అర్ధరాత్రితోపాటు సోమవారం తెల్లవారుజామున కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఎంత మంది మరణించారో కచ్చితంగా సంఖ్య వెల్లడించలేదు.
దాడులకు సంబంధించి కొన్ని ఫోటోలను హమాస్ ప్రతినిధులు టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. ధ్వంసమైన భవనాలు, శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత దృశ్యాలు దీనిలో కనిపిస్తున్నాయి.
మరోవైపు గాజాలోని కొన్ని ఆసుపత్రులకు సమీపంలోనూ పేలుళ్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ పేలుళ్లు ఎక్కడ చోటుచేసుకున్నాయి? వీటిలో ఎంతమంది మరణించారు? అనే అంశాల్లో స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Twitter/Gautami Tadimalla
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు తాడిమళ్ల గౌతమి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు.
తనను మోసం చేసిన వ్యక్తికి పార్టీ నాయకులు సహకరిస్తున్నారని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆమె లేఖ ద్వారా వెల్లడించారు.
‘‘నాకు పార్టీ లేదా పార్టీ నాయకుల నుంచి ఎలాంటి మద్దతూ లభించడంలేదు. పైగా నన్ను మోసం చేసిన వ్యక్తికే వారు అండగా నిలుస్తున్నారు’’ అని ఆమె లేఖలో చెప్పారు.
25 ఏళ్ల నుంచీ గౌతమి బీజేపీలోనే ఉన్నారు. తన రాజీనామా లేఖను షేర్‌చేస్తూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు పార్టీ విభాగం అధిపతి కే అన్నామలైలను ఆమె ట్యాగ్ చేశారు.
ఆస్తి విషయంలో తనని మోసం చేసిన సీ అళగప్పన్‌కు పార్టీలో కొందరు సాయం చేస్తున్నారని లేఖలో గౌతమి పేర్కొన్నారు.
‘’20 ఏళ్ల క్రితం ఆయన నా జీవితంలోకి వచ్చారు. నేను ఆయనను చాలా నమ్మాను. నా ఆస్తులకు సంబంధించిన పేపర్లను కూడా ఆయన చేతిలో పెట్టాను. కానీ, ఆయన నన్ను మోసం చేశారు’’ అని గౌతమి లేఖలో రాశారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళానికి చెందిన గౌతమి, తెలుగుతోపాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉండేవారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.