ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విదేశాంగ మంత్రిగా చైనా చిన్ గాంగ్‌ను తప్పించి, వాంగ్ యిని నియమించింది. 57 ఏళ్ల చిన్ గాంగ్ చివరిసారిగా జూన్ 25న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లును తీసుకొచ్చే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఈనెల 27, 28 తేదీల్లో సభకు హాజరవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం విప్ జారీ చేసినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
బీఆర్ఎస్ కూడా ఈ నెల 26, 27, 28 తేదీల్లో తమ పార్టీ ఎంపీలు రాజ్యసభకు హాజరవాలని, హౌస్‌లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలంటూ విప్ జారీ చేసిందని ది హిందూ పత్రిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసింది.
కాంగ్రెస్ కూడా తమ పార్టీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీచేసింది. ఈనెల 27న పార్టీ ఎంపీలందరూ సభకు హాజరవ్వాలని విప్‌లో పేర్కొన్నట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
చైనా, విదేశాంగ మంత్రి పదవి నుంచి చిన్ గాంగ్‌ను తప్పించింది. ఏడు నెలల క్రితమే ఆయన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.
చిన్‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా పరిగణించేవారు. ఇప్పుడు చిన్ స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ వాంగ్ యి భర్తీ చేశారు.
చిన్ గాంగ్ చాలా రోజులుగా ప్రజలకు అందుబాటులో లేరు. 57 ఏళ్ల చిన్ చివరిసారిగా జూన్ 25న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు.
విదేశాంగ మంత్రి పదవి నుంచి చిన్ గాంగ్‌ను తప్పించడానికి కారణాలను చైనా వెల్లడించలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.