You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు

ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ జలగం వెంకట్రావు 2019లో హైకోర్టులో కేసు వేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ప్రధానికి ‘ఇండియా’ అంటే ఎందుకింత వ్యతిరేకత? -ప్రియాంక గాంధీ

    విపక్షాల కూటమి ‘ఇండియా’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తోన్న కామెంట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు.

    ‘‘రాజకీయాల వల్ల ఇండియా అంటే మీరు ప్రతికూలతను, అవమానకరమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ పేరుతో మీరు పదేపదే ప్రతికూల అర్థాల వచ్చేలా వ్యాఖ్యలు చేయడం మీ పదవికి గౌరవనీయమైనది కాదు.’’

    ‘‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలియెన్స్(ఇండియా)కు రాజ్యాంగమే స్ఫూర్తి. దేశంలోని యువతకు ఉపాధి, ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం, ప్రతి వర్గానికి చెందిన ప్రజల శ్రేయస్సు, రైతుల, కార్మికుల సంక్షేమం, మహిళలకు భద్రతా, సాయం, దేశ ఐక్యతా, ప్రేమ, శాంతి అనేవి మా అజెండా’’ అని ప్రియాంక గాంధీ తెలిపారు.

    దేశ ప్రజలు ప్రతికూలరాజకీయాలు కాదు, సానుకూల రాజకీయాలను ఆశిస్తున్నారని చెప్పారు.

    మణిపుర్ ఘటనపై పార్లమెంట్‌లో మీరు చేసే ప్రకటనను దేశ ప్రజలు వినాలనుకుంటున్నారని అన్నారు.

    ద్రవ్యోల్బణం, ఉపాధిపై దేశం సమాధానాలను కోరుతుందని అన్నారు.

  3. రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచి హర్మన్ ప్రీత్ కౌర్‌ను నిషేధించిన ఐసీసీ

    ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రతీ కౌర్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది.

    రెండు సంఘటనలు నియమావళిని ఉల్లంఘించాయని ఐసీసీ పేర్కొంది.

    ఈ సంఘటనలు బంగ్లాదేశ్‌లో ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ సిరీస్‌ సందర్భంగా గత వారం ఢాకాలో జరిగాయి.

    మూడో వన్డేలో తనను ఔట్‌గా ప్రకటించడంతో, అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనానికి గురైన హర్మన్ ప్రీత్ వికెట్‌ను గట్టిగా కొట్టింది.

    ఆ తర్వాత మ్యాచ్‌ ఓడిపోవడానికి అంపైర్ కారణమంటూ నిందించింది.

    మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధంతో పాటు తన మ్యాచ్ ఫీజులో 75 శాతాన్ని జరిమానాగా కట్టాలంటూ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఐసీసీ ఆదేశించింది.

  4. మతమా, దేశమా అనే చర్చ ఎందుకు జరుగుతోంది... అసదుద్దీన్, కుమార్ విశ్వాస్ ఏమని ట్వీట్ చేశారు?

  5. రటౌల్ మామిడి: ఈ పండ్లు పుట్టింది భారతదేశంలోనా లేక పాకిస్తాన్‌లోనా?

  6. ఉత్తరప్రదేశ్: ముజఫర్‌నగర్‌లో హిందూ దేవుళ్ళ పేర్లతో ముస్లింలు నడిపే హోటళ్లపై వివాదం ఏంటి?

  7. చిరిగిన, పాడైపోయిన నోట్లను ఫ్రీగా ఎలా మార్చుకోవాలి? నిబంధనలు ఇవీ

  8. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు

    ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

    ప్రస్తుతం బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది.

    2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వనమా వెంకటేశ్వరరావు గెలిచారు.

    ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు రాగా, వనమా వెంకటేశ్వర రావుకు 81,118 ఓట్లు లభించాయి.

    4,139 ఓట్ల మెజార్టీతో వనమా విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ జలగం వెంకట్రావు 2019లో హైకోర్టులో కేసు వేశారు.

    వనమాపై పోలీసు కేసులు ఉన్నప్పటికీ,ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో నేరచరిత్ర వివరాలు ప్రకటించలేదని జలగం వెంకట్రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

    దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ప్రకటించింది. రూ.5 లక్షల జరిమానా విధించింది.

    2018లో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పటికీ వనమా తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

  9. సోఫియా దులీప్ సింగ్: బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన భారత రాకుమారి కథ

  10. మద్యం - గంజాయి: అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతారా?

  11. ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?

  12. మీపై పిడుగు పడుతుందో, లేదో పావు గంట ముందే చెప్పే యాప్

  13. పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

  14. విండీస్-భారత్ రెండో టెస్టు డ్రా: వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన చివరి రోజు ఆట

    వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది.

    పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అయిదో రోజు ఆట మొత్తం వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ డ్రా అయింది.

    దీంతో తొలి టెస్టును గెలిచిన భారత్‌కు సిరీస్ విజయం దక్కింది.

    వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో సోమవారం ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను ముగించారు.

    నాలుగో రోజు ఆటకు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్ ఆటకు నష్టం జరిగింది.

    నాలుగో రోజు ఆటలో భారత్ విధించిన 365 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 76/2తో నిలిచింది. అక్కడికే మ్యాచ్ నిలిచిపోయింది.

    ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని అందుకున్నాడు.

    ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం జరుగనుంది.