లైవ్ పేజీ ముగిస్తున్నాం
బీబీసీ తెలుగు లైవ్ అప్డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్ళీ లైవ్ పేజీతో కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ తదుపరి 24 గంటలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
బీబీసీ తెలుగు లైవ్ అప్డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్ళీ లైవ్ పేజీతో కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
దిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో దిల్లీలో జనజీవనం అతలాకుతలం అవుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో కొన్నిచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్టీల్ వంతెన అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయింది.
దిల్లీ, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ తదుపరి 24 గంటలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పశ్చిమ రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా భారీ వర్షాలు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
కుండపోత వర్షంతో దిల్లీలో జనజీవనం అతలాకుతలం అవుతోంది. యమునా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దిల్లీలో 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. 1982 తర్వాత ఇదే అత్యధికం.
దేశరాజధానిలో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతాయని అధికారులు చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో దిల్లీలోప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదివారం సెలవు రద్దు చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో కొన్నిచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండి జిల్లాలోని బియాస్ నదిపై ఉన్న ఓ స్టీల్ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్ వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా గులామ్ హైదర్‌ను కలవడానికి పాక్ విదేశీ వ్యవహారాలశాఖ భారత్‌ను అనుమతి కోరింది.
పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ అధికారులు ఇస్లామాబాద్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి షుమయిలా ఖాన్‌కు ఈ సమాచారం అందించారు.
ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ భారతీయుడైన సచిన్ మీనాతో ప్రేమలో పడిన సీమా, ఆయన్ను కలవడానికి తన నలుగురు పిల్లలతో నేపాల్ గుండా అక్రమంగా భారత్‌లోకి వచ్చారు.
భారత్‌లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శుక్రవారం సీమ, సచిన్‌లకు బెయిల్ లభించింది.
దుబాయ్‌లో ఉంటున్న సీమా భర్త గులామ్ హైదర్(పాకిస్థాన్) తన భార్యను, పిల్లలను తిరిగి తన దగ్గరకు చేర్చాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.
భారత్‌లో మీడియాతో మాట్లాడిన సీమా తను సచిన్‌తో కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
హలో!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం! నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.