You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రైళ్లలో ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీలను 25 శాతం వరకు తగ్గించనున్న రైల్వే

గడిచిన 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో తానా ఎలా ఏర్పడింది? కుల ప్రాతిపదికన అక్కడ సంఘాలు పెట్టుకుంటున్నారా?

  2. విశాఖ: దోపిడీ కేసులో అరెస్టైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఎవరు, ఆమె డ్యాన్స్ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?

  3. రైళ్లలో ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీలను 25 శాతం వరకు తగ్గించనున్న రైల్వే

    వందే భారత్‌ సహా పలు రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీలు 25 శాతం వరకు తగ్గించనుంది రైల్వే. అయితే, ఇది సీట్ల ఆక్యుపెన్సీపై ఆధారపడి ఉంటుంది.

    అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి కలిగిన అన్ని రైళ్లలో వాటి ప్రాథమిక చార్జీలపై ఈ డిస్కౌంట్ పథకం అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. అయితే, రిజర్వేషన్ రుసుము, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జ్, జీఏస్టీ వంటి ఇతర ఛార్జీలలో మార్పు ఉండదు.

    రైళ్లలో ఈ రాయితీ ఛార్జీల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్‌ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అధికారాన్ని అప్పగించనున్నారు. గడిచిన 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.

  4. మాన్యువల్ స్కావెంజింగ్: దేశంలో ఈ పని చేసేవారే లేరన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు ఎందుకు?

  5. పబ్జీ ప్రేమ కథ: ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ గురించి ఇరుగు పొరుగు ఏం చెప్పారు?

  6. ఇది పిండమార్పిడితో పుట్టిన ఆవుదూడ

  7. చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?

  8. ప్రధాని మోదీ పర్యటన: తెలంగాణకు ఏమేం ఇస్తామన్నారు? ఏం ఇచ్చారు?

  9. బురద చల్లడం తప్ప మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు: హరీశ్ రావు

    బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలను తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఖండించారు.

    మోదీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని, తాము మంచిగా పనిచేయకపోతే వీటిని ఎందుకు కాపీ కొట్టారని ఆయన ప్రశ్నించారు.

    ‘‘తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మోదీ అంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయంటే అది కేసీఆర్ గొప్పతనం.. మీరేం చేశారు..? తెలంగాణకు చాలా ఇచ్చామని మోదీ అంటున్నారు. కానీ రావాల్సిన నిధులు ఆపారు. తెలంగాణపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి. నీతి ఆయోగ్ చెప్పినా నిధులు ఇవ్వట్లేదు’’ అని ఆయన విమర్శించారు.

    తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీశ్‌రావు ఆరోపించారు.

    మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

    రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే, వ్యాగన్ యూనిట్ ఇచ్చారని మంత్రి విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు.

    ‘‘బురద చల్లడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఏదైనా అంటే ఈడీని ఉపయోగిస్తున్నారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

  10. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేకుండా చేస్తాం: వరంగల్ సభలో ప్రధాని మోదీ

    ‘జై మా భద్రకాళి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    "భద్రకాళి అమ్మవారి మహాత్మ్యానికి, సమ్మక్క సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతిగాంచిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉంది" అంటూ ఆయన తన ప్రసంగం కొనసాగించారు.

    తెలంగాణ అభివృద్ధికి తొమ్మిదేళ్లుగా తోడ్పడుతున్నామని ప్రధాని చెప్పారు.

    వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ బహిరంగ సభ జరిగింది.

    "ప్రస్తుతం తెలంగాణలో 36 వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇక్కడి రైల్వే ప్రాజెక్టులకు గతం కంటే ఎన్నో రెట్లు నిధులిచ్చాం. ఇక్కడ త్వరలో వ్యాగన్లు తయారు కానున్నాయి. భారతదేశ ఆత్మనిర్భర్‌లో తెలంగాణ పాత్ర ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో తెలంగాణ నుంచి వ్యాక్సీన్ అందింది" అని మోదీ ప్రస్తావించారు.

    తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేకుండా చేస్తామని ఆయన చెప్పారు.

    ‘‘తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజంతా నాలుగే నాలుగు పనులు చేస్తోంది. మొదటిది- మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రెగ్యులర్‌గా తిట్టడం. వీళ్ల డిక్షనరీ మొత్తం ఇదే. ఇక రెండోది.. ఒకే కుటుంబాన్ని అధికార కేంద్రంగా మార్చడం. సొంత కుటుంబాన్ని తెలంగాణకు యజమానిగా చేయడం. మూడోది.. తెలంగాణ ఆర్థిక వికాసాన్ని నాశనం చేయడం. నాలుగోది.. తెలంగాణను అవినీతిలో ముంచేయడం. అందరికంటే అత్యధిక అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. ఈయన అవినీతి దిల్లీ వరకు పాకింది" అని మోదీ ఆరోపించారు.

    ‘‘తెలంగాణ కోసం ప్రజలు ఎంతగానో పోరాడారు. బలిదానాలు చేశారు. కానీ, ఇలాంటి రోజు చూడాల్సిన ఖర్మ పట్టింది తెలంగాణ ప్రజలకు. ఇలాంటి అవినీతి కుటుంబం చేతిలో తెలంగాణ చిక్కుకుంటుందని మీరు ఎఫ్పుడు అనుకుని ఉండరు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు మరోవిషయం గుర్తించాలి. ఈ కుటుంబ పాలకులంతా అవినీతి పరులే. కుటుంబ పాలకులైన కాంగ్రెస్ అవినీతి దేశమంతా చూసింది. కుటుంబ పాలకులైన కేసీఆర్ పాలనను తెలంగాణ చూసింది. ఈ రెండు కుటుంబాలూ తెలంగాణ ద్రోహులు’’ అని మోదీ విమర్శించారు.

    “తెలంగాణలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మర్చిపోలేం. ఉద్యోగాలిస్తామన్నారు. అదీ ఇదీ అన్నారు. అన్నీ మర్చిపోయారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణం గురించి అందరికీ తెలుసు. 9 ఏళ్లుగా ఇక్కడి నిరుద్యోగులు నిరీక్షిస్తుంటేఈ ప్రభుత్వం ఆ పార్టీ నేతల మనుషులకు ఉద్యోగాలిచ్చేలా ప్లాన్ చేసింది. లక్షల మంది యువత కలలను భగ్నం చేసింది’’ అని ఆయన ఆరోపించారు.

    తెలంగాణలోని యూనివర్సిటీల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నాయని, స్కూళ్లలో 15 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మోదీ చెప్పారు.

    పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ఇవ్వలేదని, రుణ మాఫీ చేస్తామని చేయలేదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన విమర్శించారు.

    ‘‘మేం అలా కాదు. గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాం. కనీస మద్దతు ధర పెంచుతామన్నాం. పెంచాం. దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తుంటే, అందులో ఒకటి తెలంగాణలో ఉంది. తెలంగాణ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులిచ్చాం. ఏకలవ్య మోడల్ స్కూళ్లు ఏర్పాటుచేశాం. ఆయుష్మాన్ భారత్‌తో 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. గత ప్రభుత్వాలు దళితుల పట్ల, గిరిజనుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తే బీజేపీ వారికోసం నిజమైన అభివృద్ధి పనులు చేసింది’’ అని ఆయన చెప్పారు.

    బీజేపీకి రెండు సీట్లు మాత్రమే ఉన్న కాలంలో కూడా అందులో ఒకటి తెలంగాణ నుంచే ఉండేదని మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు.

    తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

    మోదీ ఆరోపణలను తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తర్వాత ఖండించారు.

  11. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నేడు ఖలిస్తాన్ మద్దతుదారుల ర్యాలీలు

    ఖలిస్తాన్ మద్దతుదారులు జులై 8 శనివారం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు.

    ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’ పేరుతో ఈ ర్యాలీలు జరుగుతాయని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ సర్క్యులేట్ అవుతోంది.

    ఈ ర్యాలీల నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలలోని దౌత్య కార్యాలయాలు తగిన భద్రతా చర్యలు చేపడుతున్నాయి.

    ఈ నాలుగు దేశాల్లో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తామని అమెరికాలో నివసించే ఖలిస్తాన్ ప్రముఖుడు గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ ఒక వీడియో సందేశంలో చెప్పారు. ఇది కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

    భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఖలిస్తాన్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

  12. హాయ్!

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం! నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.