బైడెన్‌తో మోదీ వర్చువల్ సమావేశం: యుక్రెయిన్ యుద్ధం గురించి ఏమన్నారంటే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెప్పానని ఈ సందర్భంగా బైడెన్‌కు మోదీ వివరించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. యుక్రెయిన్: రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ

    రెండేళ్ల తన కూతురి వీపుపై కాంటాక్ట్ డీటెయిల్స్ రాశారు ఒక యుక్రెయిన్ తల్లి. ఆమె ఏ పరిస్థితుల్లోఅలా రాయాల్సి వచ్చిందో బీబీసీతో చెప్పారు.

    యుద్ధం గుప్పిట చిక్కుకున్న సొంత దేశాన్ని కుటుంబం సహా వీడుతున్నప్పుడు కలిగిన బాధను, భయాన్ని ఆమె వివరించారు.

    దేశం నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఒకవేళ తాము ఒకరి నుంచి ఒకరు విడిపోయినా, చనిపోయినా తమ వివరాలు తెలియాలనే ఇలా తన కూతురు విరా వీపుపై ఆమె పేరు, వయసు, కొన్ని ఫోన్ నంబర్లు రాసినట్లు తల్లి సాషా మకోవీయ్ చెప్పారు.

    ''ఒకవేళ మేమంతా చనిపోతే అప్పుడు ఆమె ఎవరో తెలుస్తుందనే ఇలా రాశాను'' అన్నారు సాషా.

    ప్రస్తుతం సాషా కుటుంబం ఫ్రాన్స్‌లో ఉంది. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

    కూతురి వీపుపై కాంటాక్ట్ డీటెయిల్స్

    ఫొటో సోర్స్, SASHA MAKOVIY

  2. శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది

    శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు సమాచారం.

    జి. సిగడాం మండలం బాతువా రైల్వే గేటు సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్ నుండి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.

    రైలులో ఒక బోగి నుంచి పొగలు రావడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్ లాగి రైలు ఆపేశారు. భయంతో కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు.

    అదే సమయంలో భువనేశ్వర్‌ నుంచి వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ చెప్పారు.

    వారి మృతదేహలు ట్రాక్ ఇరువైపులా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

    ఈ రైలు ప్రమాద విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో, తహశీల్దార్, వైద్య బృందం సంఘటన స్థలాన్ని చేరుకుని గాయాలపాలైనవారికి చికిత్స అందిస్తున్నారు.

    రైలు ప్రమాదంలో పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    క్షతగాత్రులకు మంచి వైద్యసేవలు అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

    రైలు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

  3. ఝార్ఖండ్‌లో రోప్‌వే ప్రమాదం - కొనసాగుతున్న సహాయ చర్యలు

    ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో ఏప్రిల్ 10న రోప్‌వే మార్గంలోప్రమాదం చోటు చేసుకుంది.

    ఈ రోజు మధ్యాహ్నానికి ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారినందరినీ రక్షిస్తామని రెస్క్యూ బృందం ఇన్‌ఛార్జ్ అశ్వని నాయర్ చెప్పారు.

    "నేను మూడు రోజులు ఈ ప్రమాదంలో ఇరుక్కుని ఉండిపోయాను. బయటకు రావడం ఈ ప్రమాదం నుంచి బయటపడిన ధర్మేంద్ర చెప్పారు.

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఇప్పటి వరకు ప్రమాదంలో చిక్కుకున్న 10 మందిని రక్షించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. మరో ముగ్గురు నుంచి ఐదు మంది వరకు కేబుల్ కార్లలో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    దేవ్‌ఘర్ ఘటన పై విచారణ జరపాలని ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 26న ఈ అంశం పై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. విచారణకు ముందు ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించాలని కోరింది.

    సహాయక చర్యలు

    ఫొటో సోర్స్, ANI

  4. వరంగల్ జిల్లాలో టెస్కో గోదాంలో అగ్ని ప్రమాదం

    తెలంగాణలోని వరంగల్ జిల్లా స్థంభంపల్లిలోనిటెస్కోగోదాంలో సోమవారం భారీఅగ్నిప్రమాదం జరిగింది.టెస్కో చేనేత కార్మికుల ఉత్పత్తులను అమ్మే ప్రభుత్వ సంస్థ.

    మొత్తం 6 ఫైర్ ఇంజన్లు గోడౌన్లో మంటలను అదుపుచేసే పనిలో ఉన్నాయి, మధ్యాహ్నం వరకు మంటలు అదుపులో రావొచ్చు అని వరంగల్ ఫైర్ ఆఫీసర్భగవాన్ రెడ్డి తెలిపారు.

    ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందని ఆయన మీడియారు తెలిపారు. చేనేత అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదంలో సుమారు 30 కోట్లవిలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.

    ఎక్కువగా నూలుతో చేసిన వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక అధాకారులు తెలిపారు.

    చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వరంగల్,హన్మకొండ, వర్ధన్నపేట, పరకాల్ లకు చెందిన 40 మంది ఫైర్ సిబ్బందిఫైర్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.

    ఉమ్మడి వరంగల్ పరిధిలోని చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తైన దుప్పట్లు, స్కూల్ యూనిఫామ్స్, తివాచీలు, బెడ్ షీట్స్ ల నిల్వ కోసం 2019 నుండి ప్రస్తుతం ప్రమాదం జరిగిన గోడౌన్ ను టెస్కో నిర్వహిస్తోంది. ఇందులో సరైన అగ్నిప్రమాద నివారణ సదుపాయాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి.

    చేనేత శాఖ అధికారుల పిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రమాదం పై ఎఫ్ఐఆర్ బుక్ చేసారు.

    ‘’ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ తేలలేదు. ఇది తాత్కాళిక గోడౌన్. ఇందులో నీటిని నిల్వ ఉంచే సంప్ నిర్మాణం లేదు. ప్రమాదంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అవ్వొచ్చని భావిస్తున్నాం. గోడౌన్లో మొత్తం 27 కోట్ల విలువచేసే సరుకు ఉంది . అంతా మంటల్లో కాలిపోయింది’’ అనిటెస్కోవరంగల్ డివిజనల్ మార్కేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

    టెస్కో గోదాంలో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

  5. కేసీఆర్: ‘యాసంగిలో ప్రతి గింజను మేమే కొంటాం.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు’

  6. రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ.. వీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే..

  7. భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు?

  8. ఇండియన్ ఆర్మీ నియామకాలు ఎందుకు జరగట్లేదు? భారత సైన్యాన్ని తగ్గిస్తున్నారా?

  9. ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని..

    భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. యుక్రెయిన్‌లోని పరిస్థితిపై ఇరువురు నాయకులు చర్చించారు.

    పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ‘భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం.. కానీ కశ్మీర్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం లభించకుండా అది సాధ్యంకాదు’ అని అంతకుముందు పాకిస్తాన్ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడుతూ షాబాజ్ షరీఫ్‌ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    తూర్పు యుక్రెయిన్‌పై దాడి కోసం రష్యా వేలాది మంది సైనికులను తరలిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.

    రామ నవమిని పురస్కరించుకొని జార్ఖండ్‌లో నిర్వహించిన ఓ యాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో అమన్ అన్సారీ అనే వ్యక్తి మరణించారు. 20 మందికిపైగా ప్రజలు ఈ ఘర్షణల్లో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అమరావతిలో జరిగింది. నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు.

    తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ‘రైతు నిరసన దీక్ష’ తెలంగాణ భవన్‌లో చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

    యుక్రెయిన్ యుద్దానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  10. షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పీఠం వరకూ ఎలా వచ్చారు?

  11. ఈ యుక్రెయిన్ సైనికులు 8 ఏళ్లుగా కందకాల్లోనే ఎందుకు ఉన్నారు?

  12. బ్రేకింగ్ న్యూస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం

    మోదీ, బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు.

    యుక్రెయిన్‌ యుద్ధంపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారు.

    యుక్రెయిన్, రష్యా అధ్యక్షులతో తాను మాట్లాడానని, శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరానని ప్రధాని మోదీ చెప్పారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరినట్లు మోదీ తెలిపారు.

    యుక్రెయిన్‌లోని బుచాలో అమాయక పౌరుల హత్యలపై జో బైడెన్‌తో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

    బుచా హత్యలను ఖండిస్తున్నామని చెప్పారు. నిస్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నిరంతర సంప్రదింపులు, చర్చలు కీలకమని జో బైడెన్ అన్నారు.

    మే 24న జపాన్‌లో జరిగే క్వాడ్ సదస్సులో కలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు జో బైడెన్ మోదీతో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. ‘కిడ్నీ ఇస్తే 15 లక్షలు ఇస్తామన్నారు, ఆపరేషన్ తరువాత డబ్బులివ్వకుండా ఉడాయించారు’

  14. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని సులభంగా అర్థం చేసుకోండిలా..

    శ్రీలంక

    శ్రీలంక చిన్న ద్వీప దేశం. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది.

    కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

    కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

    దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

  15. పుతిన్‌ తన కుమార్తెలను ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారో తెలుసా?

    పుతిన్ కుటుంబం గురించి ప్రపంచానికి ఎంత తెలుసు?

    ఆయన భార్య ఏం చేస్తున్నారు?

    పిల్లలు ఎంతమంది? వాళ్లేం చేస్తున్నారు?

    వీడియో క్యాప్షన్, పుతిన్‌కు ఎంతమంది పిల్లలు, వాళ్లేం చేస్తుంటారు?
  16. కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్ ఏమన్నారంటే?

    పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

    ‘‘పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడం ఇదే తొలిసారి. నిజం గెలిచింది, అబద్ధం ఓడింది’’ అని ఆయన అన్నారు.

    ‘‘ఇది చాలా గొప్ప రోజు. చాలా రోజుల క్రితమే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోలను కలిసి అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నాం. పార్లమెంట్‌లోని ప్రతీ ఒక్కరికి ఏది నిజమో తెలుసుకునే హక్కు ఉంది. నిజాలను దాయకూడదు. బయట పెట్టాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కశ్మీర్ అంశంపైనా షాబాజ్ షరీఫ్‌ స్పందించారు.

    ‘ప్రతిఒక్క అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతాం’ అని ఆయన అన్నట్లు పీటీవీని ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ‘భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం.. కానీ కశ్మీర్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం లభించకుండా అది జరగదు’ అని షాబాజ్ షరీఫ్‌ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

  17. తూర్పు యుక్రెయిన్‌పై దాడికి రష్యా వేలాది మంది సైనికులను తరలిస్తోంది: జెలియెన్‌స్కీ

    జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, EPA

    తూర్పు యుక్రెయిన్‌పై దాడి కోసం రష్యా వేలాది మంది సైనికులను తరలిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.

    ఈ యుద్ధంలో తాము గెలవాలంటే తమకు మరింత సాయం అవసరమని దక్షిణ కొరియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడుతూ జెలియెన్‌స్కీ అన్నారు.

    మరియుపూల్‌లో రష్యా దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది పౌరులు మరణించి ఉంటారని ఆయన తెలిపారు.

  18. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల శాఖలివే...

  19. పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్

    షాబాజ్ షరీఫ్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ఆ దేశ 23వ ప్రధానిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 174 మంది సభ్యులు షాబాజ్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

    పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నేత షా మెహమూద్ ఖురేషీకి ఒక్క ఓటు కూడా రాలేదు.ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పీటీఐ సభ్యులందరూ ఉమ్మడిగా పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించడంతో ఖురేషీ పోటీలో ఉన్నా లేనట్లే అయింది. ఆయనకు ఒక్క ఓటు కూడా రాలేదు.

    సోమవారం జరిగిన బల పరీక్షలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన 70ఏళ్ల షాబాజ్ షరీఫ్ విజయం సాధించారు.

    అమెరికా ఆదేశాల మేరకు కుట్ర పన్ని తనను అధికారంలోంచి దించారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

    నేషనల్ అసెంబ్లీ విశ్వాసం కోల్పోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఇప్పుడు ఆయన తరువాత షాబాజ్ షరీఫ్ దేశ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్నారు.

    షాబాజ్ మీద హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులు విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణ ఏప్రిల 27న జరగాల్సి ఉంది. అయితే, కోర్టు ఆయన అరెస్టుపై ఏప్రిల్ 27 వరకు స్టే ఇచ్చింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. యుక్రెయిన్‌లో రంజాన్: 'ఈ కష్ట కాలంలో విశ్వాసమే మమ్మల్ని కాపాడుతుంది రక్షిస్తుంది' - బీబీసీతో ఇద్దరు ముస్లిం మహిళలు