యుక్రెయిన్-రష్యా యుద్ధం: పుతిన్‌తో మాట్లాడ్డానికి సైనిక సలహాదారులు కూడా భయపడుతున్నారా?

యుక్రెయిన్ మీద దాడిలో రష్యా బలగాలు వైఫల్యం గురించి వాస్తవ సమాచారం పుతిన్‌కు తెలియకపోవడం వల్ల శాంతి చర్చల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని...

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, PTV

    జాతిని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. తనను పదవి నుంచి తొలగించాలని ఒక దేశం నుంచి పాకిస్తాన్‌కు సందేశం వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు చివరి వరకు పోరాడతానని ఆయన అన్నారు.

    ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోననే సంకేతాలు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    మిత్రభావంతో మెలగని దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

    గ్యాస్‌ను కొనుగోలు చేయాలనుకునే దేశాలు రష్యా కరెన్సీలో లావాదేవీలు నిర్వహించాలని, రష్యన్ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని పుతిన్ చెప్పారు.

    పుతిన్ డిమాండ్లను పరిశీలిస్తామని జర్మనీ తెలిపింది. అయితే, చమురు దిగుమతులపై ఎవరి ఒత్తిడికీ తలొగ్గబోమని స్పష్టం చేసింది.

    మరియుపూల్‌లో జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు యుక్రెయిన్ ప్రభుత్వం తాజాగా రెండు బస్సులను పంపించింది.

    తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీచూడండి. ధన్యవాదాలు.

  2. చివరి బంతి వరకూ ఆడతాను -ఇమ్రాన్ ఖాన్

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Facebook/ImranKhan

    ‘‘ఒక దేశం నుంచి పాకిస్తాన్‌కు ఒక సందేశం వచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సందేశంలో ఉంది’’అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

    ‘‘నేను 20ఏళ్లపాటు క్రికెట్ ఆడాను. నాతోపాటు క్రికెట్ ఆడిన వారితోపాటు ప్రపంచం మొత్తానికీ తెలుసు. నేను ఓటమిని అంగీకరించను. చివరి బంతి వరకు ఆడతాను. నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటానని ఎవరూ అనుకోవద్దు. ఏది ఏమైనప్పటికీ నేను మరింత దృఢంగా మీ ముందుకు వస్తాను’’అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

    మరోవైపు తను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయననే సంకేతాలను ఇమ్రాన్ ఖాన్ ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం లైవ్

  4. పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, PTV

    దేశ భవిష్యత్ కోసం మాట్లాడుతున్నానని చెబుతూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగం మొదలుపెట్టారు.

    ‘‘మన ముందు రెండు మార్గాలున్నాయి. దేన్ని ఎంచుకోవాలనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’అని ఆయన చెప్పారు.

    ‘‘దేశ ప్రజలతో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను’’ అని ఇమ్రాన్ చెప్పారు.

    ‘‘పాకిస్తాన్ వయసు నా కంటే కేవలం ఐదేళ్లే ఎక్కువ. నా తల్లి తండ్రులిద్దరూ బ్రిటిష్ పాలనా కాలంలోనే పుట్టారు. నువ్వు స్వతంత్ర దేశంలో పుట్టి అదృష్టవంతుడవయ్యవు అని వారు చెప్పేవారు’’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

  5. ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి సాయం అందకుండా చూడాలి - విపక్షాలు

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, PTI

    నేషనల్ రీకన్సీలియేషన్ ఆర్డినెన్స్ (ఎన్ఆర్‌వో) కింద పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి సాయమూ అందకుండా చూడాలని పాక్‌లోని విపక్షాలు నిర్ణయించాయి.

    పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు గురువారం ఇస్లామాబాద్‌లో సమావేశం అయ్యాయి. దేశంలో రాజకీయ పరిణామాలతోపాటు అవిశ్వాస తీర్మానంపైనా చర్చించాయి.

    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన 172 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్ఆర్‌వో కింద ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి సాయమూ అందకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.

    ఇమ్రాన్ ఖాన్ ఆధిక్యం కోల్పోయారని, ప్రస్తుతం ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారని వారు తీర్మానించారు.

    నేషనల్ రీకన్సీలియేషన్ ఆర్డినెన్స్ (ఎన్ఆర్‌వో)ను పాక్ ఇదివరకటి అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తీసుకొచ్చారు. దీని కింద మినహాయింపు పొందే అధికారులు, నాయకులపై అవినీతి లేదా ఇతర కేసులు పెట్టి విచారణ చేపట్టడానికి వీల్లేదు.

    ఆసిఫ్ అలీ జర్దారీ, రెహమాన్ మలిక్, కొందరు సీనియర్ మంత్రులు, ప్రభుత్వ అధికారులకు ఎన్ఆర్‌వో కింద ముషారఫ్ మినహాయింపులు ఇచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. నెమళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు

    షా అలీ ఆర్థిక ఇబ్బందులతో 8వ తరగతిలోనే చదువు మానేశారు. తన సొంత సేవింగ్స్‌తో నెమళ్ల పెంపకం మొదలుపెట్టారు. తన వ్యాపారానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా పొందారు.

    వీడియో క్యాప్షన్, నెమళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు
  7. పాకిస్తాన్ - ఇమ్రాన్‌ఖాన్: ‘నవాజ్ షరీఫ్ భారతీయ వ్యక్తులను కలిసేవారు.. ఆయన ఇంట్లో కుట్ర పన్నారు’, పాకిస్తాన్‌ మంత్రి ఆరోపణలు

    పాకిస్తాన్‌లోని ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద కాకుండా దేశ ప్రజల మీదే యుద్ధం ప్రకటించాయని, ప్రభుత్వం కూలిపోకుండా చివరి నిమిషం వరకు పోరాడతామని ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌధరి అన్నారు.

    ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి పెద్ద కుట్ర జరుగుతోందని, నవాజ్ షరీఫ్ కొందరు భారతీయ వ్యక్తులతో మాట్లాడటం అందరికీ తెలిసిన విషయమేనని ఫవాద్ ఆరోపించారు. లండన్‌లోని నవాజ్ అపార్ట్‌మెంట్‌లో ఈ కుట్ర జరిగిందని ఆయన అన్నారు.

    పాకిస్తాన్ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారని ఫవాద్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ హుందాగా తప్పుకుంటే మంచిది: విపక్షాలు

    అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటారని పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారు షాబాజ్ గిల్ వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులకు ఆయన ఓ ప్రతిపాదన పంపారన్న వార్తను ఆయన ఖండించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే, పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు వెళ్దామని ప్రతిపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోరని, ఈ పోరాటాన్ని ఆయన ఎదుర్కొంటారని షాబాజ్ గిల్ చెప్పారు.

    మరోవైపు నేషనల్ అసెంబ్లీ సమావేశానికి ముందుకు ప్రతిపక్ష ఎంపీలు సమావేశయ్యారు. దీనిలో 172 మంది ఎంపీలు పాలుపంచుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ హుందాగా రాజీనామా చేయడం మేలని పాకిస్తానీ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఏప్రిల్ 3న ఓటింగ్ జరుగనుంది.

  9. ఏఎఫ్ఎస్‌పీఏపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

    మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    అస్సాం, మణిపుర్, నాగాలాండ్ రాష్ట్రాలలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫ్ఎస్‌పీఏ) పరిధిలో ఉండే కల్లోలిత ప్రాంతాల పరిధిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

    ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లలోని కల్లోలిత ప్రాంతాల పరిధిని తగ్గించాలని నిర్ణయించింది. కొన్ని దశాబ్దాల తర్వాత భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని అమిత్ షా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అక్కడ భద్రతా పరిస్థితులు మెరుగుపడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక పర్యాయాలు చర్చలు జరిపిందని, దీంతో ఇక్కడ తీవ్రవాదం తగ్గిందని ఆయన అన్నారు.

  10. విశాఖపట్నంలో వ్యాపారాలు ఆపేస్తున్నానని వైసీపీ ఎంపీ ఎందుకు చెప్పారు?

    ఇకపై తన వ్యాపారాలను విశాఖపట్నంలో క్లోజ్ చేస్తున్నానని వైసీపీ విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు.

    ఇకపై తన వ్యాపారం అంతా హైదరాబాద్‌లోనే చేసుకుంటానన్నారు.

    అధికార పార్టీ ఎంపీ ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఏం జరిగింది?

  11. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఐసీయూలో పేషెంట్‌ను కొరుక్కుతిన్న ఎలుకలు

    ఎలుక

    ఫొటో సోర్స్, Getty Images

    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక పేషంట్‌ను ఎలుకలు కొరికాయి. దీంతో ఆ వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం జరిగింది.

    వరంగల్ నగరం భీమారంకు చెందిన శ్రీనివాస్‌ను ఈ నెల 26న శ్వాస సంబంధిత సమస్యతో ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఆర్ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

    ఆసుపత్రిలో చేరిన తొలి రోజే శ్రీనివాస్ చేతిని ఎలుకలు కొరికినట్లు చూసిన బంధువులు, వైద్యులకు చెప్పడంతో చికిత్స అందించారు.

    అయితే ఈ రోజు మరోసారి కాళ్లు, చేతులను ఎలుకలు కొరకడంతో తీవ్రరక్తస్రావం అయింది.

    ఐసీయూ వంటి అత్యవసర విభాగంలో డ్యూటీ స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రాత్రి పూట రోగుల వద్ద ఎవరూ ఉండటం లేదని... శ్రీనివాస్ కుటుంబ సభ్యుడైన శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎంజీఎంలో జరిగాయి. మార్చురీలో ఉంచిన మృతదేహాలను ఎలుకలు కొరికేసిన సందర్భాలు ఉన్నాయి.

    ఈ ఘటనపై స్పందించిన ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావ్, ఆసుపత్రి శానిటేషన్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పాత భవనాలు కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దగ్గరలోనే ఆసుపత్రి కిచెన్ ఉండటంతో ఎలుకల బెడద ఉందని అన్నారు.

  12. నితీశ్ కుమార్: ‘మందు తాగే వాళ్లు పాపాత్ములు’

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

    ఫొటో సోర్స్, Facebook/Nitish Kumar

    మద్యం పానం చేసే వాళ్లు పాపాత్ములని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మందు తాగడాన్ని మహాత్మా గాంధీ పాపంగా చూసేవారని ఆయన చెప్పుకొచ్చారు.

    బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్-2022ను అసెంబ్లీ పాస్ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    విషపూరితమైన మద్యాన్ని తాగి చనిపోతున్నారని, దాన్ని నిషేధించాలని నితీశ్ అన్నారు. మద్యం తాగడం మంచిది కాదని గాంధీ అన్నారని, గాంధీని మాటలు వినని వాళ్లు పాపాత్ములని చెప్పుకొచ్చారు.

    బిహార్‌లో మద్యపాన నిషేధం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి చాలా కఠినమైన శిక్షలు విధిస్తున్నారని, చాలా మంది విచారణ ఖైదీలుగా జైలులో మగ్గుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్-2016కు సవరణలు చేశారు.

  13. అమెరికా: ‘పుతిన్‌కు వాస్తవం తెలియదు’

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో రష్యా బలగాల వాస్తవ పరిస్థితిని వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పడానికి ఆయన సలహాదారులు భయపడుతున్నారని అమెరికా రక్షణశాఖ తెలిపింది.

    యుక్రెయిన్ మీద దాడిలో రష్యా బలగాలు వైఫల్యం గురించి వాస్తవ సమాచారం పుతిన్‌కు తెలియకపోవడం వల్ల శాంతి చర్చల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవచ్చని అది అభిప్రాయపడింది.

    ‘తన బలగాలు వైఫల్యం చెందాయనే విషయం తెలిస్తే పుతిన్ వంటి నాయకుడు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు’ అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

  14. ‘డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పెట్రోలు రేట్లను డబుల్ చేయడమేనా?’

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ట్విటర్ వేదికగా అన్నారు.

    పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు రాష్ట్రాల మీద భారాన్ని మోపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెట్రోలు ధరలపై నాటి యూపీఏ సర్కారును విమర్శిస్తూ చేసిన ట్వీట్లను కేటీఆర్ ఇప్పుడు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

    ‘పెట్రోలు ధరల భారీ పెంపు అనేది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ప్రధాన వైఫల్యం. దీంతో గుజరాత్ మీద వందల కోట్ల భారం పడుతోంది.’ అంటూ 2012 మే 23న నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    ఆ తరువాత ప్రధాని అయిన తరువాత 2014 అక్టోబరు 4న నరేంద్ర మోదీ మరొక ట్వీట్ చేశారు. ‘మా ప్రభుత్వం వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మన దేశానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఆ ట్వీట్‌లో మోదీ రాశారు.

    'డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు డబుల్ చేయడం... కార్పొరేట్ సంస్థల సంపదను డబుల్ చేయడం’ అంటూ @KeerthiRachana అనే ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రిట్వీట్ చేశారు.

    పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల మీద చాలా భారం పడుతోందని తెలిపారు. పేదలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

    పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. లీటరుకు రూపాయికి చొప్పున ధరలు పెంచారు.

    ఉత్తర్ ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఆ తరువాత నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

    కేటీఆర్ చేసిన రిట్వీట్

    ఫొటో సోర్స్, Twitter

  15. ఆధార్, పాన్ లింక్‌కు నేటితో ముగుస్తున్న గడువు ... లేదంటే ఫైన్ కట్టాలి

    పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం

    ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది.

    గడువు తరువాత కూడా లింక్ చేయకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది.

    ఫైన్ కట్టి ఈ ఏడాది జూన్ 30లోపు ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ గడువు కూడా దాటితే ఆ తరువాత ఫైన్ రెట్టింపు అవుతుంది.

    ఆధార్‌తో పాన్‌ను రెండు నిమిషాల్లో ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

  16. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం

    ఫొటో సోర్స్, Getty Images

    నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 0.26శాతం, నిఫ్టీ 0.24శాతం చొప్పున పెరిగాయి.

    నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ వంటి రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

    ఇక ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

    యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.

  17. మరియుపూల్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

    మరియుపూల్‌లో భవనం ముందు కూర్చొని ఉన్న యుక్రెయిన్ ప్రజలు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని మరియుపూల్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.

    ప్రజలను తరలించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.

    మరియుపూల్ నుంచి జపోరిజియాకు రష్యా బలగాల అధీనంలోని బెర్డియానస్క్ మీదుగా హుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద యుక్రెయిన్ ఇంకా స్పందించలేదు.

  18. రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు

    • కొన్నిసార్లు ఆదేశాలు పాటించేందుకు రష్యా బలగాలు నిరాకరిస్తున్నాయని బ్రిటన్ సైబర్ ఇంటెలిజెన్సీ విభాగం తెలిపింది. ఒకసారి అనుకోకుండా తమ సొంత విమానాన్నే రష్యా సైన్యం కూల్చిందని వెల్లడించింది.
    • రష్యా, యుక్రెయిన్ శాంతి చర్చలు శుక్రవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా మళ్లీ ప్రారంభం కానున్నట్లు యుక్రెయిన్ ప్రతినిధి డేవిడ్ అర్ఖామియా తెలిపారు.
    • యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది ప్రజలు యుక్రెయిన్ వదిలి పారిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తెలిపింది.
    • కొన్ని బలగాలను వెనక్కి తరలిస్తామని రష్యా చెప్పినా ఇంకా చెర్నిహివ్ మీద దాడులు చేస్తోందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు.
    • దొనెత్స్క్ ప్రాంతంలో అన్ని పట్టణాల మీద రష్యా బాంబు దాడులు చేస్తోందని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
  19. సైనిక సలహాదారులు తప్పుదారి పట్టించారని పుతిన్ ఎందుకు భావిస్తున్నారు?

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    సైనిక సలహాదారులు తనను తప్పుదారి పట్టించినట్లు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారని అమెరికా చెబుతోంది.

    దాంతో పుతిన్‌, ఆయన సైనిక సలహాదారులకు మధ్య వాతావరణం కాస్త ఉద్రిక్తకరంగా మారిందని వైట్ హౌస్ ప్రతినిధి కేట్ బెడింగ్‌ఫీల్డ్ తెలిపారు.

    యుక్రెయిన్ మీద యుద్ధం రష్యా చేసిన వ్యూహాత్మక తప్పిదాలలో ఒకటని, దీర్ఘకాలికంగా చూస్తే ఇది రష్యా మరింత బలహీనం చేయడంతోపాటు, ప్రపంచవేదికల మీద ఆ దేశాన్ని ఏకాకిని చేస్తుందని ఆమె అన్నారు.

    యుక్రెయిన్‌లో వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో రష్యా విఫలమైందని, ఇప్పుడు తన యుద్ధంపై తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని బ్రిటన్ సైబర్ ఇంటెలిజెన్స్ విభాగం జీసీహెచ్‌క్యూ సారథి జెరేమీ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చారు.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.