గుడ్ మార్నింగ్!
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశానికి కొత్త వ్యవసాయ విధానం అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు, వ్యవసాయం అంటే పట్టింపులేదని ఆరోపించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
శ్రీరాముడు హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి దేవుడని నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి అన్నారు.
ఉద్దంపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు.
‘‘జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు ప్రకటించినప్పుడు, ప్రజల దృష్టి మరల్చడానికి వారు రామాలయాన్ని ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నా. కానీ, రాముడు అందరివాడు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
‘‘కేవలం రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు. దీని నుంచి బయటికి రావాలి. శ్రీరాముడు అందరివాడు. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అమెరికన్ లేదా రష్యన్ అయినా.. అందరికీ దేవుడే. అల్లా కూడా ముస్లింలకు మాత్రమే దేవుడు కాదు, అందరికీ దేవుడని మేం చెప్పినట్లు, రాముడు కూడా అందరివాడు’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AMIT SAINI
కదులుతోన్న రైలులో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
సుబేదార్‌గంజ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 22432(ఉదయంపూర్-సుబేదార్‌గంజ్ ఎక్స్‌ప్రెస్)లో మార్చి 22వ తేదీన రాత్రి 2 గంటలకు స్లీపర్ కోచ్‌లో నిద్రపోతున్న మైనర్ బాలికపై టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తోన్న ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ సంఘటనపై బాధిత బాలిక కుటుంబం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలిక కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఫొటో సోర్స్, AMIT SAINI
బాధిత బాలిక తండ్రి వృత్తిపరంగా న్యాయవాది. కాన్పూర్‌లో నివసిస్తున్నారు.
మాత వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించుకుని జమ్ము నుంచి తిరిగి వస్తోన్న సమయంలో రైలులో ఈ సంఘటన జరిగింది.
ఈ విషయంపై బాలిక తండ్రి యూపీ పోలీసులకు ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా, రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా అందజేశారు.
మర్రి రాజశేఖర్ - 22 ఓట్లు
పెనుమత్స సూర్యనారాయణ రాజు - 22 ఓట్లు
బొమ్మి ఇజ్రాయిల్ - 22 ఓట్లు
పంచుమర్తి అనురాధా - 23 ఓట్లు
పోతుల సునీత - 22 ఓట్లు
యేసు రత్నం - 22 ఓట్లు
కోలా గురువులు - 21 ఓట్లు
కాగా 7 స్థానాలకు గాను వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీ పడ్డారు. వీరిలో వైసీపీకి చెందిన జయమంగళ వెంకటరమణ, కోలా గురువులు ఇద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు 21 చొప్పున సమానంగా వచ్చాయి. మిగతా ఆరుగురికి 21 కంటే ఎక్కువ ఓట్లు రావడంతో వారి విజయం ముందే ఖరారైంది.
వీరిద్దరికి 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. అందులో జయమంగళ వెంకట రమణకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు.
దీంతో వైసీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు, టీడీపీ నుంచి ఒకరు విజయం సాధించినట్లయింది. పోటీ చేసినవారిలో కోలా గురువులు ఓటమి పాలయ్యారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో జరుగుతోన్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నీతూ ఘంఘాస్ తర్వాత నిఖత్ జరీన్ కూడా ఫైనల్స్‌కి చేరుకున్నారు.
సెమీ ఫైనల్స్‌లో 50 కేజీల వెయిట్ కేటగిరీలో కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిట్ లోరెనా వాలెన్సియా విక్టోరియాపై నిఖత్ జరీన్ గెలిచారు.
మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్‌గా జరిగింది. జరీన్ తన ప్రత్యర్థిని 5-0 తేడాతో ఓడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, facebook
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటివరకు ప్రకటించిన ప్రకారం వైసీపీ నుంచి బరిలో నిలిచిన మర్రి రాజశేఖర్, పెన్మత్స సూర్యనారాయణ, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు.
టీడీపీ అభ్యర్థి అనురాధకు 23 ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి 23 మంది శాసనసభ్యులు విజయం సాధించగా అందులో నలుగురు అనంతరం వైసీపీ పక్షం వహించారు.
అయినప్పటికీ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు వచ్చాయి.
అంతకుముందు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 8 గంటలకి పోలింగ్ ప్రారంభం అయ్యింది.
తొలుత సీఎం జగన్ తన ఓటు వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తం ఓట్లన్నీ చెల్లుబాటైనట్లు కౌంటింగ్ అధికారులు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత డాటా దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
వీరు వివిధ వెబ్‌సైట్ల నుంచి డాటా తీసుకుని దాన్ని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. బీమా పాలసీలు, లోన్లు కోసం దరఖాస్తు చేసుకున్నవారి వ్యక్తిగత డాటా చోరీకి గురైనట్లు గుర్తించామని తెలిపారు.
‘డిఫెన్స్ , ఆర్మీ ఉద్యోగుల కు చెందిన సెన్సిటివ్ డేటా ను సైతం అమ్మకానికి పెట్టారు.. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. మహిళల కు చెందిన వ్యక్తిగత వివరాలు సైతం చోరీ చేసి నేరగాళ్లకు అమ్ముకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూకోసం ఒక ఏజెన్సీ నీ పెట్టుకుంటే అందులో ఉద్యోగి ఒకరు డాటా విక్రయించారు. డేటా చోరీ కేసులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు లేఖ రాస్తాం’ అని కమిషనర్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..
పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు.
తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు.
సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెప్పింది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెప్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందన్నారు.
హైకోర్టు తరలింపు అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని, ఏపీలో ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయన్నారు.
హైకోర్టు తరలింపుపై ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు తమతమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉందన్నారు.

ఫొటో సోర్స్, BRS
దేశానికి కొత్త వ్యవసాయ విధానం అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు, వ్యవసాయం అంటే పట్టింపులేదని ఆరోపించారు.
ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు,వడగళ్లతో పంట నష్టం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ రోజు ఖమ్మం, మహబూబాబాద్ , వరంగల్, కరీంనగర్ జిలాల్లో పర్యటించారు.
రైతులతో ముఖాముఖి మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగితెలుకున్నారు.
అడవి రంగాపురం, రెడ్డికుంట తండ, రామాపురం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు.
నష్టపోయిన రైతులకు పంటలతో సంబందం లేకుండా ఎకరానికి రూ. 10 వేల చొప్పున వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
2.28 లక్షల్లో పంట నష్టం జరిగిందని మొత్తం 228 కోట్లను రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, BRS
కొంతమంది మూర్ఖులు, ఆర్థిక వేత్తలు వ్యవసాయం దండగ అని అంటున్నారని అయితే ఇప్పటికీ జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) లో వ్యవసాయ రంగం వాటానే ఎక్కువ అని కేసీఆర్ అన్నారు.
కేంద్రానికి నష్టం నివేదికలు పంపితే ఆరు నెలలకు గానీ స్పందన రావడం లేదని, కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని అందుకే నష్టం నివేదికలు కేంద్రానికి పంపకుండా తెలంగాణ ప్రభుత్వమే వందశాతం సహాయం అందిస్తుందన్నారు.
రైతులు నిరాశకు గురికావొద్దని రైతులకు అందిస్తున్నది నష్టపరిహారం కాదని, సహాయ పునరావాస చర్యలు అని కేసీఆర్ అన్నారు. గతంలో ఎకరానికి 10 వేల చొప్పున దేశంలో ఎక్కడా పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు.
నష్టపోయిన వారిలో కౌలు రైతులు ఉంటే పరిహారం వారికే అందేలా చూడాలని లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తామని కేసీఆర్ అన్నారు.
కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన ఇంకా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతోన్న ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్ ముగిసింది.
రాష్ట్ర అసెంబ్లీలో తొలి అంతస్తులో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 2.30 గంటల కల్లా మొత్తం 175 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Andhra Pradesh CMO
శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల పోలింగ్ అమరావతిలో జరుగుతోంది.
ఉదయం 11 వరకు ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 175 ఎమ్మెల్యేలకుగాను ఇప్పటివరకు 130 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన ఏడుగురు అభ్యర్థులూ విజయం సాధించి వైసీపీ గట్టెక్కడమనేది ఆరుగురు ఎమ్మెల్యేల తీరు మీద ఆధారపడి ఉంటుంది. టీడీపీ నుంచి వైసీపీ వైపు మళ్లిన నలుగురు, వైపీసీ నాయకత్వం మీద అసంతృప్తితో టీడీపీ వైపు చూస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు ఈ ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉంది.
వైసీపీ, టీడీపీ రెండూ విప్‌లు జారీచేశాయి. ఎమ్మెల్యేలు ఎవరైనా విప్ ధిక్కరించి ముందుకెళితే, ఆ తర్వాత రాజకీయంగా అనేక మలుపులు ఉండొచ్చు. ఈ అంశంపై బీబీసీ తెలుగు కథనాన్ని చదవండి:

ఫొటో సోర్స్, UGC
లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విశాఖపట్నం రామజోగిపేటలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
ప్రమాదం మార్చి 23న గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం రాత్రంతా విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూనే ఉంది.
45 ఏళ్ల నాటి ఈ భవనంలో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనం పిల్లర్లతో కాకుండా పునాదులపై నిర్మించింది. పునాదులపైనే మూడు అంతస్తులు నిర్మించడం, భవనం పాతది కావడం వల్లే కూలిపోయి ఉంటుందనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ భవనంలో మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది నివసిస్తున్నారని, ఈ ఘటనలో అంజలి, సాకేత్, దుర్గాప్రసాద్ అనే ముగ్గురు మరణించినట్లు ఆర్డీవో హీదయతుల్లా చెప్పారు.
మృతుల్లో సాకేటి దుర్గాప్రసాద్, సాకేటి అంజలి ఇద్దరూ అన్నాచెళ్లెళ్లు. మార్చి 22న అంజలి పుట్టినరోజు వేడుకలు ముగించుకుని అంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.