You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
88ఏళ్ల వయసులో బొమ్మలు చేసి విదేశాలకు పంపిస్తున్న బామ్మ
సాధారణంగా మహిళలకు 80 ఏళ్లుదాటితే మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.
కానీ గుజరాత్‌లోన అహ్మదాబాద్‌కి చెందిన బామ్మ 88ఏళ్ల వయసులో సైతం ఆటబొమ్మలు, ఇతర హస్తకళా అలంకరణ వస్తువులు తయారు చేస్తారు.
వాటినిభారత్‌లో అమ్మడమే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
‘‘నాకు 88 ఏళ్లు. నేను దాదాపు యాభయ్యేళ్లుగా హస్తకళా వస్తువుల వ్యాపారంలో ఉన్నాను. మొదట్లో నేను ఫ్లోర్ మ్యాట్లు, చీరలతో మ్యాట్లు తయారు చేసేదాన్ని. నేను పాత చీరలతో మొబైల్ కవర్స్, పర్సులు, జేబురుమాళ్లు కూడా తయారు చేస్తాను. గత కొన్నేళ్లుగా నాకు వేర్వేరు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వివిధ రకాల పక్షి
బొమ్మల ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లు నాకు పక్షుల శాంపిల్ ఫొటోలు పంపిస్తారు. వాటిని చూసి నేను బొమ్మలు తయారు చేస్తాను. ఇప్పటికి నేను ౧౦ దేశాలకు 75 పక్షల బొమ్మలు ఎగుమతి చేశాను.’’ అని ఆమె చెప్పారు.
పాత బట్టలను ఉపయోగిస్తూ బొమ్మలు, ఇతర హస్తకళా వస్తువులు తయారు చేస్తారు పద్మ బా.
‘‘నేను బెడ్‌షీట్లు తయారు చేస్తాను. ముందుగా ముడి సరకు సేకరిస్తాను ఆ తర్వాత డిజైన్ నిర్ణయించుకుంటాను. ఒక బెడ్ షీట్ తయారు చేయడానికి మూడు నెలలు పడుతుంది. Best from the Waste అనే దానికి ఇదో గొప్ప ఉదాహరణ. ప్లాస్టిక్ సిమెంట్ బస్తా నుంచి నేను ఈ బ్యాగ్ తయారు చేశాను. ఈ పర్సు ఎక్కడో పడి ఉండగా నా కంటపడింది. దానికి బయటి నుంచి డిజైన్ అల్లాను. ఒక కొత్త పర్సు తయారైంది.
దప్పికతో ఉన్న కాకి కథ అందరికీ తెలుసు. నేను ఒక కాకిని తయారు చేసి, ఈ మట్టి కూజాను తెచ్చాను. అలా దీనికో డిఫరెంట్ లుక్ వచ్చింది.
నా దేవత కోసం నేను వులెన్ క్లోత్స్ తయారు చేస్తుంటాను. ఇది చలి కాలం కోసం. వాడేసిన బట్టలు, దారాల నుంచి నేను ఒక బ్లౌజ్ తయారు చేశాను. ఏ చీరనైనా ఇలా బ్లౌజ్‌గా అల్లుకోవచ్చు.’’ అని బామ్మ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది-
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్- భారత స్టార్టప్--లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి- ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా-
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)