తుర్కియే భూకంపం: ఐదు రోజుల తర్వాత శిధిలాల నుంచి బయట పడిన బాలుడు

వీడియో క్యాప్షన్, తుర్కియే వైద్య సిబ్బంది ముందు భారీ సవాళ్లు

ప్రపంచ దేశాల నుంచి అందుతున్న విరాళాలతో బాధితులకు వైద్యం అందించేందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నారు.

పూర్తిగా ధ్వంసమైన నగరం మధ్యలో- చిన్నారి అరాస్‌ను కలిశాం. అతనికి ఐదేళ్లు. శిథిలాల కింద 105 గంటల పాటు చిక్కుకుపోయాడు. సహాయ సిబ్బంది అతడిని బయటకు తీశారు.

భూకంపంలో అతడి అన్న, అక్క, తండ్రి చనిపోయారు. అరాస్‌ను బిడ్డలా చూసుకుంటానని అతడి తాత మెమిత్ చెప్పారు.

భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఓ ఆసుపత్రి నుంచి బీబీసీ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)