ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

వీడియో క్యాప్షన్, ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

అర్జెంటీనాకు చెందిన మరియానా వారెలా, పుయెర్టోరీకోకు చెందిన ఫాబియోలా వాలెంటిన్ ఇద్దరూ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 ఈవెంట్‌లో కలుసుకున్నారు. ఆ అందాల పోటీలలో వారు ఆ ఏడాదికి తమ తమ దేశాల తరఫున చాంపియన్స్‌గా నిలిచారు.

థాయిలాండ్‌లో జరిగిన ఆపోటీలలో వారిద్దరూ టాప్-10 దశకు చేరుకున్నారు. ఆ సమయంలోనే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారని సీఎన్ఎన్ తెలిపింది.

ఈ అందాల భామలు ఆదివారం నాడు స్పానిష్ భాషలో తమ పెళ్ళి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)