పాకిస్తానీ మహిళల్లో చీరల పట్ల ఆసక్తిని పెంచుతున్న ‘ది శారీ గర్ల్‌’ ఐజా హుస్సేన్

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో చీర పట్ల ఆసక్తిని పెంచేందుకు పాటుపడుతున్న ఓ మహిళ

ఐజా హుస్సేన్ అనే ఓ పాకిస్తానీ యువతి తమ దేశంలో చీరకు ఒకప్పటి వైభవాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు.

చీరను సాధారణంగా భారతీయతకు, హిందుత్వానికి ప్రతీకగా చూస్తూ ఉంటారు.

శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న చీరకట్టు... సింధూనాగరికత కాలంనాటిదని చెబుతారు.

అయితే, దేశవిభజన తర్వాత పాకిస్తాన్‌లో మహిళల్లో చీర కట్టే సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది.

ముస్లిం మూలాలున్నాయని నమ్మే సల్వార్ కమీజ్‌కు అక్కడి జాతీయ వస్త్రధారణగా ప్రచారం లభించింది.

అమ్మాయిలు ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు అంటున్న ఐజా హుస్సేన్‌ కథనం ఆమె మాటల్లోనే..

ది సారీ గర్ల్ పేరుతో ఇన్స్టాగ్రామ్‌లో ఓ ప్లాట్‌ఫాంని క్రియేట్ చేశాను. పాకిస్తాన్‌ మహిళలకు కూడా చీరను దగ్గరచేయాలనేది దీని ఉద్దేశం.

నా గ్రాడ్యూయేషన్ డిన్నర్ కోసం తక్కువ ధరలో, తేలికైన చీరను చూస్తున్నాను. అసలు అలాంటి చీరలు కనుమరుగయ్యాయని అప్పుడు అర్థమైంది. అలాంటి చీరలు ఎందుకు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు... నాకెందుకు అవి దొరకడంలేదని ఆశ్చర్యం అనిపించింది. అలాంటి చీర నాకు ఎక్కడ దొరుకుతుందని అని మా మామ్మని, అమ్మని, అత్తయ్యని అడిగాను.

అప్పుడు నేను సోషియాలజీ, ఆంత్రపాలజీ చదువుతున్నాను . మామూలుగానే నాకు చరిత్ర అంటే ఆసక్తి ఎక్కువ. దాంతో చీరల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. లోకల్ మార్కెట్లకు వెళ్లి అక్కడి చీరల వ్యాపారం చేసేవాళ్లతో మాట్లాడుతుండేదానిని. పుస్తకాలు కూడా చదివేదానిని.

అప్పుడు నేను నా కోసం కొన్ని చీరలు అందరికీ చాలా బాగా నచ్చాయి. దాంతో మా అంకుల్ వీటి గురించి నన్ను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయమని ఏదైనా బిజినెస్ కూడా చేయోచ్చేమో చూడమని అన్నారు.

తర్వాత నేను ఆన్‌లైన్లో ఒక్క పోస్ట్ చేశాను. లేచే సరికి 50కి పైగా మెసేజ్‌లు కనిపించాయి. ప్రజలు తక్కువ ధరల్లో సింపుల్ చీరల కోసం చూస్తున్నారని అప్పుడర్థమైంది.

అలాంటి చీరలకు డిమాండ్ ఉన్నా అవి వారికి అందుబాటులో లేవు. తర్వాత పనులన్నీ చాలా వేగంగా గాడిలో పడ్డాయి. చాలా ఇష్టంతో వాటిపై పనిచేశాను. దీనికి కారణం చీరలలో ఉన్న అందం ఒక్కటే కాదు...చాలా మంది దగ్గర చీరల గురించి వింటున్న మాటలు కూడా నన్ను వాటి చుట్టూనే ఆలోచించేలా చేశాయి. కొంతమంది మహిళలు తమకు చీరంటే చాలా ఇష్టమని కానీ అత్తగారికి ఇష్టం ఉండదు కనుక కట్టుకోనని చెప్పారు. కొందరేమో తమ భర్తకు చీర పెద్దగా నచ్చదని అన్నారు. మరికొంతమంది పెళ్లికి ముందు మాత్రం చీర కట్టుకొనివ్వరని అన్నారు ఎందుకంటే అది హిందూ సంప్రదాయం అని తమ సంస్కృతి కాదనేది వారి భావన.

చీరల్లో పాకిస్తాన్ మహిళలు

వాళ్లు నాతో చెప్పిన చాలా విషయాలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించేది. నా వరకు అయితే ఇది ఫ్యాషన్ కోసం కాదు..ఇది మన సంస్కృతి. అప్పుడు, ఇప్పుడు ఎప్పడూ చీర మన సంస్కృతిలో భాగమే . మొదట్లో యువతులు, 20 నుంచి 30 ఏళ్ల లోపు వారు, వర్కింగ్ ఉమన్ మాత్రమే మా దగ్గర చీరలు దొరికేవి. కానీ ఇప్పుడు అన్ని వయసుల వారికి మేం చీరలు అందుబాటులోకి తెచ్చాం.

జియా పాలనా సమయంలోనే చీర చాలావరకు కనుమరుగైంది. అలా అని పూర్తిగా చీరను బ్యాన్ చేశారని మాత్రం చెప్పలేం ఎందుకంటే ఆర్మీలో మహిళలు ఎప్పుడూ చీరనే ధరించేవారు. అదే సమయంలో టీవీ, థియేటర్లలో కూడా చీర ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇక్కడ చీర కన్నా సల్వార్ కమీజ్‌కే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ డ్రెస్‌ల విషయంలో చీర భారత సంప్రదాయమని మాకు సల్వార్ కమీజ్ అని అనుకునేదానిని.

భారత్‌ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐజాకు ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి.

మాకు ఈ చీరలు బాగా నచ్చాయి మీరు వీటిని మాకు పంపించగలరా అని ఇండియాలో ఉంటున్న వారు అడుగుతుంటారు. సరిహద్దులు దాటిన వారి ప్రేమతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.. ఇప్పటికీ మీరు చీరలో బయటకు వెళితే ఎవరైనా మీ వైపు ఓ క్షణం అలా చూడాల్సిందే.

చీర ఇంకా ఇక్కడి ప్రజలకు నార్మల్ అవ్వలేదనే చెప్పాలి. సీక్రెట్‌గా పంపించండని, నా స్నేహితుని చిరునామాకు పంపమని, నేను పైన ఉంటాను మా అత్తగారు కింద ఉంటారు వాళ్లకు నేను ఆర్డర్ చేసినట్టు తెలియకూడదని అని చాలామంది కోరుతుంటారు. చాలా మంది మహిళలు తమ రంగు, శరీరాకృతి గురించి ఆలోచిస్తారు. అందరూ సన్నగా , నాజూకుగా ఉన్నవారే ఉండరు కదా.. పైగా అలా ఏ ఒక్కరి కోసమో చీరలను తయారు చేయడం కూడా మంచిది కాదు. మేం ఇక్కడ చీరను నార్మల్ చేయాలంటే ఇంకా చాలా సమయమే పడుతుంది..కానీ ఇప్పటికైతే చీర కట్టుకోవాలనుకునేవారికి చాలా సులభంగానే చీర దొరుకుందని మాత్రం చెప్పగలను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)