సింగపూర్: రాణి మరణం తర్వాత ఈ దేశం కామన్‌వెల్త్‌లో కొనసాగుతుందా? లేదా?

వీడియో క్యాప్షన్, బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్లిన సింగపూర్

రాణి మరణం తర్వాత - కామన్వెల్త్ దేశాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కామన్‌వెల్త్‌లో 54 సభ్య దేశాలను కలిపి ఉంచడంలో ఆమె పాత్ర సాయపడింది. ఆసియాలో బ్రిటిషర్ల పాలన నుంచి స్వేచ్చ పొందిన తర్వాత సింగపూర్ నాటకీయంగా ఎదిగింది. కామన్‌వెల్త్ దేశాల విజయగాధకు నిదర్శనంగా నిలిచింది. బ్రిటిష్ పాలనలోని సానుకూల అంశాలకు జ్ఞాపకంగా ఈ నగర రాజ్యం పరిస్థితేంటి. బీబీసీ ప్రతినిధి నిక్ మార్ష్ అందిస్తోన్న రిపోర్ట్.

ఆధునికతకు పర్యాయ పదంగా మారింది సింగపూర్. అయితే గత చిహ్నాలను చూస్తే.. ఆ దేశం ఏమిటో అర్థమవుతుంది.

దూరాలోచన కలిగిన సింగపూర్‌లో రాణి ఎలిజబెత్ ఆత్మ మిళితమై ఉంది.

1972లో మొదటిసారిగా రాణి ఎలిజబెత్ సింగపూర్ వచ్చినపుడు - ఆనాటి వలస పాలకులకు - తాము సొంతంగా ముందుకు అడుగులేయగలమని చూపించేందుకు తాపత్రయపడింది ఈ అభ్యుదయ యవ్వన దేశం

ప్రస్తుత సింగపూర్‌లో గుర్తింపు పొందిన ప్రజా గృహ నిర్మాణానికి మార్గదర్శిగా నిలిచిన ఈ ఎస్టేట్‌ను ఆమె సందర్శించారు.

రాణి ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ఇక్కడికొచ్చినపుడు జెరోమి లిమ్‌కు ఏడేళ్లు. ఆయన తల్లిదండ్రుల ఫ్లాట్‌లోకి రాణి, యువరాజును ఆహ్వానించారు.

''తలుపు దగ్గర వాళ్లతో కరచాలనం చేశాం. అక్కడ కనిపిస్తున్న పిల్లాడిని నేనే. అందులో నేను కేమెరావైపు చూస్తున్నాను. అది నా చిన్నతనంలోనే ఎంతో గొప్ప సంఘటన. నా తల్లిదండ్రులకు కూడా. వారి రాక గురించి ఇప్పటికీ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. వాళ్ల జీవితంలో ఇది ఎంతగానో గుర్తిండిపోయే విషయమంటారు'' అని జెరోమి లిమ్‌ అన్నారు.

200 ఏళ్ల క్రితం సింగపూర్‌లోని స్థానిక మాలే ప్రజలకు ఇళ్లు నిర్మించారు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సింగపూర్ ప్రజల మూలాలు మాత్రం చైనాలో ఉన్నాయి.

బ్రిటషర్ల పాలన ముగిశాక, అవకాశాల కోసం వెతుక్కుంటూ ప్రస్తుత సింగపూర్ వాసుల పూర్వీకులు ఇక్కడికొచ్చారు.

అవకాశాలను మెరుగుపర్చుకునేందుకే కామన్వెల్త్‌లో కొనసాగుతున్నామనేది సింగపూర్ విదేశాంగమంత్రి అభిప్రాయం.

సింగపూర్ చరిత్ర ఆధిపత్య కథ కాదు అంటున్నారు ఆయన.

''మాకెలాంటి బ్యాగేజ్ లేదు. గతంపై వివాదాల జోలికి వెళ్లదలచుకోలేదు. మా గతాన్ని మేము గుర్తిస్తాం. వారసత్వంగా పొందిన వ్యవస్థలకు గుర్తింపు ఇస్తాం. బ్రిటిష్ అండర్ స్టేట్మెంట్‌ను ప్రశంసిస్తాం. మా ప్రస్తుత సాధనాలైన ఆచరణీయ విధానాలను, వివేకాన్ని, సమంజసత్వాన్ని మేము పూర్తిగా నమ్ముతాం. ఇందులో మేము పంచుకున్న చరిత్రకూడా ప్రతిబింబిస్తుంది'' అని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ చెప్పారు.

సింగపూర్ ఆచరణాత్మక విధానాలే వలసపాలనలో తమ గతాన్ని తేలికగా స్వీకరించేలా చేస్తోంది.

నిజానికి సింగపూర్‌లో వలస పాలనా కాలం నాటి విగ్రహాలు, పేర్లు, భవనాలపైనా ఎటువంటి వివాదం లేదనే చెప్పాలి. బ్రిటిషర్లు రావడంతో ఈ ద్వీపం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారడానికి సాయపడింది. అలానే 1960లలో బ్రిటషర్లు వెళ్లిపోయిన నాటి నుంచీ సింగపూర్ ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు.

ప్రస్తుత కామన్వెల్త్ అధినేత అయిన నూతన రాజు - ఐదేళ్ల క్రితం సింగపూర్ వచ్చారు.

కింగ్ చార్లెస్ 3 ఇక్కడకి వస్తే - బహుశా 50 ఏళ్ల క్రితం ఆయన తల్లి రాణి ఎలిజబత్‌ కోసం వచ్చినంత మంది భారీ స్థాయిలో ప్రజలు రాకపోవచ్చు. కానీ ఆయనకు సాదర స్వాగతమే లభిస్తుంది.

ఎందుకంటే ఇక్కడ గతాన్ని తవ్వుతూ ఎక్కువ సమయాన్ని వెచ్చించే పరిస్థితులు లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)