బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్దం ఎలా ఉంటుందో తెలుసా... ఇదిగో వినండి
అంతరిక్షంలోని ఒక పెద్ద బ్లాక్‌హోల్ నుంచి వచ్చే శబ్దం ఇలాగే ఉంటుంది. ఈ శబ్దం శ్రావ్యంగా ఉందా లేక భయపెడుతోందా?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ శబ్దాన్ని పెర్సియస్ గెలాక్సీ నుంచి రికార్డ్ చేసింది. ఈ గెలాక్సీ మనకు సుమారు 20 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
నిజానికి, ఇది కాలబిలం నుంచి వచ్చే శబ్దం మాత్రమే కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ హోల్ చుట్టూ గెలాక్సీలు ఎక్కువగా ఉన్న చోట గ్యాస్ చాలా దట్టంగా ఉంటుంది. దాని నుంచి ప్రెషర్ వేవ్ అంటే ధ్వని తరంగాలు వస్తాయని వారు చెబుతున్నారు.
అయితే, ఆ ధ్వని చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీని మనిషి కూడా వినగలిగేలా 50 ఆక్టేవ్‌ల వరకు పెంచారు.
మీరూ ఆ ఆద్భుత శబ్దాన్ని వినండి.
ఇవి కూడా చదవండి:
- మీ పిల్లలు అసాధారణ ప్రజ్ఞావంతులని గుర్తించడం ఎలా... వండర్ కిడ్స్ అంటే ఎవరు?
- జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజేపీలో చేరతారా లేదా - అభిప్రాయం
- భారతదేశంలో 'అబ్బాయే పుట్టాలనే' అలోచనకు కాలం చెల్లిందా... లింగ నిష్పత్తి మెరుగుపడుతోందా?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్లో ఏం జరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)