అఫ్గానిస్తాన్‌లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్న గర్భవతులు, నవజాత శిశువులు...
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి తిరిగొచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఈ దేశం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
జాతీయ రిజర్వు నిధులు విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయి ఉన్నాయి. దీంతో పరిపాలనా శక్తిగా రూపొందటానికి తాలిబాన్లు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది దేశం విడిచి వెళ్లిపోయారు. మిగిలిన వారి బతుకులు ఛిద్రమయ్యాయి.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలను ప్రజాజీవితం నుంచి బహిష్కరించారు. వారు ఎక్కడ పనిచేయవచ్చు, ఎలా ప్రయాణించవచ్చు, ఏం ధరించవచ్చు అనే అంశాలపై ఆంక్షలు, పరిమితులు విధించారు. బాలికలు సెకండరీ స్కూళ్లకు హాజరవటానికి వీల్లేదని నిషేధించారు. ఫలితంగా దేశం ఒక తరం మహిళా డాక్టర్లు, టీచర్లు, ఇతర వృత్తి నిపుణులను కోల్పోయే ప్రమాదంలో ఉంది.
విదేశాల నుంచి అందే నిధులు ఒక్కసారిగా ఆగిపోవడం కూడా.. దేశ ఆరోగ్య రంగం కుప్పకూలటానికి ప్రధాన కారణం. ఫలితంగా మహిళలకు ఆరోగ్య సేవలు అందకుండాపోతున్నాయి. బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే... ఈశాన్య అఫ్గాన్‌లోని బదక్షాన్ ప్రావిన్స్‌లో ఒక ప్రసూతి వార్డును ప్రత్యక్షంగా చూశారు. ఆమె అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)