రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?

వీడియో క్యాప్షన్, రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ 'ఎక్స్‌ప్రెస్ వే'ను జులై 16న ప్రారంభించారు.

ప్రధాని ప్రారంభించిన అయిదు రోజులకే ఆ రోడ్డు అనేక చోట్ల పాడైంది.

రోడ్డు ప్రారంభించిన తరువాత పడిన తొలి వర్షానికి అది అనేక చోట్ల దెబ్బతిని, గోతులు పడి, పగుళ్లు ఏర్పడడంతో ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

అయితే, ఇవన్నీ చిన్నచిన్న సమస్యలేనని.. తొందర్లోనే మరమ్మతులు చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)