రష్యా-యుక్రెయిన్ యుద్ధం: పశ్చిమ దేశాల అత్యాధునిక ఆయుధాలతో యుక్రెయిన్ పైచేయి సాధిస్తోందా?
తూర్పు యుక్రెయిన్ మీద రష్యన్ దాడుల తీవ్రత సగానికి తగ్గిందంటూ, తమకు అత్యాధునిక ఆయుధాలు అందించిన పశ్చిమ దేశాలకు ధన్యవాదాలు చెప్పారు యుక్రేనియన్ సైనికులు.
అయితే ఇది యుద్ధంలో ఓ చిన్న విరామమా.. లేక యుద్ధంలో రాబోతున్న కొత్త మలుపుకు సంకేతమా?
డోన్బాస్ నుంచి బీబీసీ ప్రతినిధి ఆండ్రూ హార్డింగ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
యుక్రెయిన్ యుధ్ధభూమిలో మెరుపులతో కూడిన పేలుళ్లిప్పుడు సుపరిచితం.
కానీ ఇక్కడ డోన్బాస్‌లో ఏదో మారుతోంది.
యుద్ధంలో బలాల్ని సమతుల్యం చేసే ఆయుధాలతో కలుసుకోవడానికి ముందుగా అంగీకారం కుదిరిన రహస్య ప్రాంతానికి మేము వెళుతున్నాం.
సీజర్ అని పిలిచే ఈ ఆయుధాన్ని ఫ్రాన్స్ యుక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చింది.
ఈ భారీ తుపాకీని 27కిలోమీటర్ల ఆవల ఉన్న రష్యన్లపైకి గురిపెట్టారు.
ఒక్క నిమిషంలో 3తూటాలు పేల్చిన తక్షణం ఇక్కడినుంచి వెనుదిరుగుతోంది.
ఈ తుపాకులు పరిస్థితిని మార్చేశాయంటున్నారు యూనిట్ కమేండర్ దిమిత్రో.
‘‘చాలా దూరంలో ఉన్నా రష్యన్లపై మరింత కచ్చితత్వంతో కాల్పులు జరపగలం. దానర్థం వాళ్లిప్పుడు గతంతో పోలిస్తే మా మీద జరిపే దాడులు సగం లేదా మూడోవంతు కంటే తక్కువ.’’
రష్యన్ల భారీ ఆయుధ సామగ్రి గిడ్డంగిని పేల్చేశారు. సీజర్, లాంగ్ రేంజ్ అమెరికన్ రాకెట్ల వంటి ఆయుధాల వల్లనే ఇది సాధ్యమైంది.
క్రైమియాకు సమీపంలోని, ఖేర్సన్ దక్షిణాన ఇలాంటి చోట రష్యన్ సేనుల ఆయుధాలతో సహా ఇరుక్కుపోయాయి. భవిష్యత్‌లో యుక్రెయిన్ ఈ ప్రాంతంపై ఇలాంటి ఆయుధాలతో దాడి చేసే అవకాశం ఉంది. ఇందులో బాగంగా కీలకమైన వంతెనలను కూడా పేల్చేస్తున్నారు.
తూర్పు ప్రాంతంలో అంతా నిశబ్ధం.. అసాధారణ నిశబ్ధం. రష్యా మళ్ళీ తప్పటడుగు వేస్తుందన్న సంకేతంలా కనిపిస్తోంది.
ఆ నిశబ్ధాన్ని వినండి. యుద్ధరంగంలో ఇక్కడ సైనికులు ముందుకుసాగుతున్నారంటే పాశ్చాత్య దేశాలు అందించిన ఆయుధాలు నిజంగానే పెద్ద మార్పుని తెచ్చాయని అనుకోవచ్చు. అయితే అది నిర్ణయాత్మకమైనది కాకపోవచ్చు. రష్యన్లను వెనక్కి తరిమాలంటే వారికి ఇలాంటివి చాలా అవసరం.
ఇప్పుడు సమతుల్యంగా ఉంది. సగం సగం అని చెప్పారు కల్నల్ యూరి బెరెజా. ఫిరంగులను అందించిన పశ్చిమ దేశాలకు అదొక ధన్యవాదాలు. అయితే మేమింకా ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు. మాకింకా చాలా ఆయుధాలు కావాలి. లేకపోతే మా రక్తం చిందాల్సిందే.
ఇక్కడ ఆయుధాలొక్కటే సమస్య కాదు.
అంగబలం కూడా కావాలి. యుక్రెయిన్ అనేక మంది సైనికులను కోల్పోయింది. కొత్త నియామకాలతో లోటుని భర్తీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అందుకే ఇంతకు ముందెన్నడూ పోరాడని వాలంటీర్లకు ప్రైవేట్, పశ్చిమ దేశాల సైనిక నిపుణుల బృందంతో మరింత శిక్షణ ఇస్తున్నారు.
గుండె ధైర్యం మెండుగా ఉన్నా.. విజయం సాధించడానికి అవసరమైనన్ని ఆయుధాలు లేదా సుశిక్షితులైన సైనికులు లేరు.
ఇవి కూడా చదవండి:
- చికోటి ప్రవీణ్ ఎవరు? తెలుగు రాష్ట్రాలను కుదుపుతోన్న క్యాసినో కేసు ఏంటి? ప్రముఖులతో ప్రవీణ్, మాధవ్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి?
- ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ
- ఎయిర్ ఫ్రైర్‌లో వంట ఓవెన్ కంటే ఆరోగ్యకరమా? ఇది ఎలా పని చేస్తుంది?
- అడాల్ఫ్ హిట్లర్ వాచీ: రూ.30 కోట్లకు పైగా అమ్ముడవుతుందని అంచనా వేస్తే 9 కోట్లు కూడా రాలేదు.. వేలంపైనా వివాదం
- అర్జంటుగా రక్తం కావాలి, దాతలు దొరక్కపోతే ఏం చేయాలి, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చా
- భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)