శ్రీలంకలో రోజురోజుకూ తీవ్రమవుతున్న సంక్షోభం... తిండి కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలు

వీడియో క్యాప్షన్, పిల్లలకు పాలు కొనాలన్నా అనుకూలించని దారుణ పరిస్థితి

శ్రీలంక తీవ్ర మానవ సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఐక్యరాజ్యసమితి చెప్తోంది.

దేశంలోని 22 కోట్ల మంది జనాభాలో చాలా మంది తిండి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.

చమురు నిండుకుంటోంది. జబ్బులకు అవసరమైన మందులు అందటం లేదు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.. విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం దగ్గర నగదు నిల్వలు లేకపోవడమే.

ఆర్థిక నిర్వహణా వైఫల్యాలు, పర్యాటక రంగాన్ని కోవిడ్ మహమ్మారి దెబ్బతీయటం కూడా ఈ పరిస్థితులకు దారితీశాయి.

బీబీసీ ప్రతినిధి రజిని వైద్యనాథన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)