శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి ఎలా పారిపోయారు

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి ఎలా పారిపోయారు

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతోన్న వేళ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం నుంచి మిలిటరీ జెట్‌లో పారిపోయారు.

73 ఏళ్ల గొటాబయ రాజపక్ష నిష్క్రమణతో దశాబ్దాల పాటు శ్రీలంకలో సాగిన కుటుంబ పాలన ముగిసినట్లు అయింది.

శనివారం ఆయన నివాసాన్ని నిరసనకారులు ముట్టడించే సమయానికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆయన ఆచూకీ తెలియలేదు.

నిరసనల నేపథ్యంలో జూలై 13న తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన తొలుత హామీ ఇచ్చారు.

అధ్యక్షుడు దేశం నుంచి వెళ్లిపోయారనే వార్తలు తెలియడంతో కొలంబోలో ప్రధానంగా నిరసనలు జరుగుతోన్న గాలె ఫేస్ గ్రీన్ ప్రదేశంలో సంబరాలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)