యుక్రెయిన్ యుద్ధం: అంతా పుతిన్ అనుకున్నట్లే జరుగుతోందా? రష్యాలో పేలుళ్లు ఏం చెబుతున్నాయి?
యుక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించటం కోసం పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థల నాయకులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారు.
వాస్తవానికి యుక్రెయిన్‌లో అవినీతి గురించి చర్చించటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే రష్యా దాడితో సమావేశం అజెండాను మార్చారు.
తూర్పు యుక్రెయిన్‌లోని లుహన్స్క్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆ దేశాధ్యక్షుడు జెలియన్‌స్కీ ప్రకటన చేసిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
లిషీచాన్స్క్ నగరం మీద రష్యా నిరంతరాయంగా దాడులు చేయటంతో తమ సైనికులు ప్రజల ప్రాణాలను కాపాడటానికి అక్కడి నుంచి వెనుదిరిగారని యుక్రెయిన్ చెప్తోంది.
బీబీసీ ప్రతినిధి సారా రెయిన్స్‌ఫోర్డ్ అందిస్తున్న కథనం.
లిషీచాన్స్క్‌ని స్వాధీనం చేసుకోవడంతో రష్యా దళాలు వేడుక చేసుకున్నాయి. కానీ దాని అర్థం యుక్రెయిన్‌లోని మరో నగరం శిధిలమైందని. డోన్బాస్ తూర్పు ప్రాంతంలో పట్టు కోసం రష్యా దళాలు కొన్ని వారాలుగా పోరాడుతున్నాయి. యుక్రెయిన్ బలగాలపై నెమ్మదిగా దాడులు చేస్తున్నా అవి ప్రాణాంతకంగా ఉన్నాయి. ఇది స్వేచ్చ కోసం జరుగుతున్న యుద్ధమని వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. యుక్రెయిన్ ఇది దురాక్రమణ అంటోంది. దేశాన్ని కాపాడేందుకు యుక్రెయిన్ సైన్యం శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి పోరాడుతోంది.
డోన్బాస్ నుంచి కాసేపటి క్రితం వెనక్కు వచ్చిన సైనికుల్ని మేము కీయెవ్‌లో కలిశాం. తమ దేశంపై పుతిన్ దాడిని తిప్పి కొట్టేందుకు ముగ్గురు పురుషులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు.
కీయెవ్ చుట్టు పక్కల జరుగుతున్న దాని కంటే తూర్పున జరుగుతున్న యుద్ధం చాలా క్రూరంగా ఉందని వారు చెప్పారు. కీయెవ్ వద్ద రష్యా బలగాలను యుక్రెయిన్ సైనికులు తిప్పికొట్టారు. తాము ఇంకా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు చెబుతున్నారు.
ఇప్పుడు రష్యా లోపల కూడా ఈ యుద్ధం పర్యవసనాలు తీవ్రంగా ఉన్నాయి. యుక్రెయిన్ సరిహద్దులోని బల్గోరాడ్ నగరంలో పేలుళ్లు సంభవించాయి. నలుగురు పౌరులు చనిపోయారు. యుక్రెయిన్ ప్రయోగించిన మిస్సైళ్ల వల్లే ఈ పేలుళ్లు జరిగాయని రష్యా చెబుతోంది. వ్లాదిమిర్ పుతిన్ అనుకున్నట్లే అంతా జరగడం లేదనడానికి ఇదొక సూచిక.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్లో జీ-20 సదస్సు నిర్వహించడంపై వివాదం దేనికి... పాకిస్తాన్ ఎందుకు వద్దంటోంది?
- కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి ఈ లాయర్
- పుష్ప గ్యాంగ్: సరికొత్తగా చందనం స్మగ్లింగ్... పగలంతా రెక్కీ, రాత్రిపూట పక్కాగా చోరీ
- డార్క్ మ్యాటర్ అంటే ఏంటి... ఈ రహస్యాన్ని సైంటిస్టులు త్వరలో ఛేదించబోతున్నారా?
- జమ్మూకశ్మీర్: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్తో బీజేపీకి సంబంధం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)