You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్: షాపింగ్ మాల్ మీద ‘రష్యా’ మిసైల్ దాడి... 16 మంది మృతి
యుక్రెయిన్‌లోని క్రెమెన్సోక్ నగరంలో గల ఒక షాపింగ్ మాల్ మీద జరిగిన మిసైల్ దాడిలో సుమారు 16 మంది చనిపోయారు. దాడి జరిగిన సమయంలో దాదాపు 1,000 మంది అందులో ఉండి ఉంటారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ తెలిపారు.
జర్మనీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు ఈ దాడిని ఖండించారు. 'అమాయకులైన ప్రజల మీద దాడులు చేయడం యుద్ధ నేరమే.' అని ఉమ్మడి ప్రకటనలో జీ7 దేశాల అధినేతలు ప్రకటించారు.
రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలకు 130 కిలోమీటర్ల దూరంలోనే క్రెమెన్సోక్ ఉంటుంది.
మిసైల్ దాడిలో 59 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ దాడికి కారణం రష్యానే అని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఇప్పటి ఆ షాపింగ్ మాల్‌లో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. రాత్రి కావడం వల్ల సహాయక చర్యలు కాస్త నెమ్మదించాయని, చీకటిలోనూ బాధితులను కాపాడేందుకు జనరేటర్లు తీసుకొచ్చినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
భయానక వాతావరణం
సోఫీ విలియమ్స్, బీబీసీ న్యూస్
క్రెమెన్సోక్‌లో షాపింగ్ మాల్ మీద దాడి జరిగిన తరువాత పరిస్థితి భీతావహంగా మారింది. ఇప్పటికి నగరమంతా పొగ చూరిన వాసన వస్తోంది. షాపిల్ మాల్ అంతా శిథిలాల కుప్పగా మారింది.
సహాయక చర్యలు చేపడుతున్న పనుల శబ్ధాలు మినహా అక్కడ ఏమీ వినిపించడం లేదు. మంటలను పూర్తిగా ఆపామని, కానీ పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయని ఒక అధికారి మాతో చెప్పారు.
స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటలకు షాపింగ్ మాల్ మీద దాడి జరిగింది. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుందనే భయాలున్నాయి.
Tu-22M3 లాంగ్ రేంజ్ బాంబర్ లాంచ్ చేసిన Kh-22 మిసైల్ షాపింగ్ మాల్‌ను ఢీ కొట్టినట్లు యుక్రెనియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. కానీ ఇది నిజమో కాదో బీబీసీ ధ్రువీకరించుకోలేదు.
రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించడంపై జీ7 దేశాల అధినేతలు జర్మనీలో చర్చిస్తున్న తరుణంలోనే ఈ మిసైల్ దాడి జరిగింది.
తాము పౌరులను లక్ష్యంగా చేసుకుని ఎన్నడూ దాడులు చేయలదంటూ వాదిస్తున్న రష్యా ఈ ఘటన మీద ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- పీటర్ ద గ్రేట్‌తో తనను పోల్చుకున్న పుతిన్.. యుక్రెయిన్ యుద్ధం ఆక్రమణే అని చాటిన రష్యా అధ్యక్షుడు
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)