చైనా సోషల్ మీడియా యూజర్ల ఆనందానికి బలవుతోన్న ఆఫ్రికన్ పిల్లలు

వీడియో క్యాప్షన్, చైనా సోషల్ మీడియా యూజర్ల ఆనందానికి బలవుతోన్న ఆఫ్రికన్ పిల్లలు

చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో– ఆఫ్రికన్ పిల్లలపై జాత్యహంకార వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని పర్సనలైజ్డ్ వీడియోల్లో పిల్లలను ఎలా దోపిడీకి గురిచేస్తున్నారో బీబీసీ ఆఫ్రికా ఐ బృందం చేపట్టిన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది.

ఈ తరహా వీడియోలను సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు.

ఆఫ్రికాలోని మలావి గ్రామీణ ప్రాంతానికి చెందిన కొందరు పిల్లలను ఉపయోగించుకొని చేసిన వీడియోలను అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు చైనీయులు.

ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్నఒక చైనా వీడియో ప్రొడ్యూసర్‌ వ్యవహరాన్ని బీబీసీ బృందం బట్టబయలు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)