ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) అంటే ఏంటి?

వీడియో క్యాప్షన్, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటి?

ఒక కొత్త ప్రచ్ఛన్న యుద్ధం గురించి కొందరు మాట్లాడుతున్నారు. అయితే, గతంలో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ఏంటి? దీనికి ఎందుకంత ప్రాధాన్యం.

అమెరికా నేతృత్వంలోని పెట్టుబడిదారీ పాశ్చాత్య దేశాలకు.. సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు దేశాలకూ మధ్య ఘర్షణ ఇది.

1940ల చివర్లో ప్రారంభమైంది. 1991లోముగిసింది.

ఆధునిక ఆయుధాలు, అంతరిక్ష టెక్నాలజీలో ఈ రెండూ పోటీ పడ్డాయి.

దీనిని 'కోల్డ్' వార్ అని ఎందుకు అంటారు?

ఒకరితో మరొకరు అధికారికంగా యుద్ధం చేయలేదు. అందుకే ఇది 'కోల్డ్' వార్.

తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరు చేస్తున్న బెర్లిన్ గోడ 1989లో కూలిపోవడంతో, తర్వాత సోవియట్ యూనియన్ పతనంతో ఈ కోల్డ్ వార్ ముగిసింది.

యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమించడంతో రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య మరో కోల్డ్ వార్ ప్రారంభం అవుతుందా అని కొందరు అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)