నరమేధం అంటే ఏంటి?

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

‘మానవజాతికి వ్యతిరేకంగా నేరాలు’లో నరమేధం ఒకటి. అత్యంత తీవ్రమైంది. దీనిని అంతర్జాతీయ చట్టం ప్రకారం

నేరంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో దీనిపై విచారణ జరుపుతారు.

'ఒక దేశాన్ని, జాతిని, మతాన్ని, వర్గాన్ని ధ్వంసం చేసే ఉద్దేశ్యంతో తీసుకునే చర్యలు' అని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

ఈ చర్యలు హత్యలు కావొచ్చు.. లేదంటే భౌతికమైన, మానసికమైన దాడులు కావొచ్చు.

‘‘ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆ వర్గంలో.. పిల్లలు పుట్టకుండా చేయడం కూడా నేరమే’’.

నాజీ హోలోకాస్ట్‌ 60 లక్షల మంది యూదులను చంపేసింది.

దీనికి స్పందనగానే నరమేధంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పదం తర్వాత మూడు నరమేధం కేసుల్లో శిక్షలు పడ్డాయి. అవి.. 1994 రువాండా, 1970 కంబోడియా, 1995 సెబ్రెనికా నరమేధాలు.

నరమేధం జరిగింది అనే ఆరోపణలున్న మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)