హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన యుద్ధం ఇది
కోట్లాది ప్రాణాలు బలి తీసుకుని రెండో ప్రపంచయుద్ధ గమనాన్ని సమూలంగా మార్చేసిన యుద్ధం 'బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్‌గ్రాడ్'. ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఇదీ ఒకటి.
1943 ఫిబ్రవరి 2న స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ బలగాలు హిట్లర్ నాయకత్వంలోని యాక్సిస్ సేనలను ఓడించాయి. హిట్లర్ ఓటమితో స్టాలిన్‌గ్రాడ్ యుద్ధానికి తెరపడింది.
బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ రష్యాలతో కూడిన అలైడ్ కూటమి... రెండో ప్రపంచయుద్ధ విజేతగా నిలవడానికి ప్రధాన కారణం స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో సాధించిన విజయమే.
సుమారు 6 నెలలపాటు సాగిన ఈ యుద్ధంలో రెండు వైపులా దాదాపు 18 లక్షల మంది సైనికులు చనిపోయారు. మరెంతో మంది సామాన్య ప్రజలు మరణించారు.
1942లో మొదలైన యుద్ధం
1942 జూన్‌లో జర్మనీ నేతృత్వంలోని యాక్సిస్ కూటమి సైన్యం దక్షిణ రష్యాపై ఆక్రమణను ప్రారంభించింది. రస్తోఫ్, వొరొనెస్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదలింది.
జులై చివరి నాటికి నాజీ బలగాలు సోవియట్ రష్యా బలగాలను డాన్ నది వరకు వెనక్కు తరిమాయి. 1942 జులై, అగస్టులో కలచ్ వద్ద స్టాలిన్‌గ్రాడ్ ఫ్రంట్‌తో జరిగిన యుద్ధంలో హిట్లర్ బలగాలు విజయం సాధించాయి.
కలచ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది స్టాలిన్‌గ్రాడ్. అంటే నగరం పొలిమేరల వరకూ చేరుకున్నాయి జర్మన్ సైన్యాలు.
అలా 1942 అగస్టులో స్టాలిన్‌గ్రాడ్ ఆక్రమణ మొదలైంది. బలం విషయంలో సోవియట్ రష్యా కంటే మెరుగ్గా ఉన్న జర్మన్ బలగాలు తొలుత వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగాయి. యుద్ధవిమానాలతో స్టాలిన్‌గ్రాడ్ మీద టన్నుల కొద్ది బాంబుల వర్షాన్ని కురిపించాయి.
సెప్టెంబరు నాటికి స్టాలిన్‌గ్రాడ్‌లో ఉక్కు, ఆయుధాలు, ట్రాక్టర్లు తయారు చేసే కీలక ఫ్యాక్టరీల మీద జర్మనీ దాడి మొదలైంది.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- రష్యాను యుద్ధంలోకి లాగాలని అమెరికా ప్రయత్నిస్తోంది - పుతిన్
- రాష్ట్రపతికి బహుమానంగా జింబాబ్వే ఇచ్చిన ఏనుగును తిరిగి పంపించేయమంటూ కోర్టులో పిటిషన్
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)