కిలో ఉల్లి రూ.600, మిర్చి రూ.710.. ఎక్కడ? ఎందుకు?

వీడియో క్యాప్షన్, కిలో ఉల్లి రూ.600, మిర్చి రూ.710.. ఎక్కడ? ఎందుకు?

ఇప్పుడు మీరు శ్రీలంకలో ఉన్నారనుకోండి... ఏదైనా టీ స్టాల్‌కు వెళ్లి ఒక చాయ్ అడిగితే... పాలతో కావాలా? పాలు లేకుండా కావాలా అని వెంటనే అడిగేస్తారు టీ అమ్మే వ్యక్తి.

అదేంటి… మామూలుగా అయితే షుగర్‌ గురించి కదా అడిగేది అని మీరు ఆశ్చర్య పోవచ్చు.

కానీ ఇప్పుడు శ్రీలంకలో ఉన్న వాస్తవ పరిస్థితి అయితే అదే. ప్రస్తుతం అక్కడ ధరలు మండిపోతున్నాయ్.

కేజీ పాల పొడి ధర శ్రీలంక కరెన్సీలో వెయ్యి రూపాయలకు పైనే. కేజీ ఆలుగడ్డలు 200 రూపాయలు దాటాయ్. ఇక 100 గ్రాముల పచ్చి మిరపకాయలు కొనాలంటే అక్షరాలా 71 రూపాయలు చెల్లించాల్సిందే.

కిలో ఉల్లి గడ్డల ధర 600 రూపాయలకు పైనే. ధరలిలా రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ పోతుండటంతో శ్రీలంక ప్రజలకు బతుకు భారంగా మారుతోంది.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)