ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్... ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు సోమవారం రాత్రి దాదాపు 9 గంటల నుంచి నిలిచిపోయాయి. ప్రపంచంలో అత్యధిక ప్రాంతాల్లో ఈ సోషల్ మీడియా వేదికలు 'ఔటేజ్' అయినట్లు చాలా మంది యూజర్లు ట్విటర్‌లో తెలిపారు.

ఇది రాసే సమయానికి వాట్సాప్ గంటకు పైగా పని చేయడం లేదు. మెసేజ్‌లు పంపించడం లేదా అందుకోవడం సాధ్యం కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ‌లో 'ఫీడ్ రిఫ్రెష్ చేయడం సాధ్యం కావడం లేదు' అనే మెసేజ్ వస్తోంది. అలాగే, ఫేస్‌బుక్ పేజీ కూడా లోడ్ కావడం లేదు.

ఫేస్‌బుక్ స్వయంగా ఈ ఔటేజిని అంగీకరిస్తూ, త్వరలో సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం కృషి చేస్తోందని మెసేజ్ ఇచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ఈ మూడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సమస్యలు తలెత్తాయని ధ్రువీకరించింది.

వాట్సాప్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఒక మెసేజ్ చేసింది. కొంతమంది వాట్సాప్ ఉపయోగించలేక పోతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది, సమస్యను పరిష్కరించి, సేవలను యధాతథంగా కొనసాగించేందుకు మేం కృషి చేస్తున్నామని, యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఆ సందేశంలో పేర్కొంది.

ఫేస్‌బుక్‌కు భారతదేశంలో 41 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వాట్సాప్‌ను అయితే 53 కోట్లకు పైగా యూజర్లు భారత్‌లో వినియోగించుకుంటున్నారు. 21 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం మెసెంజర్ కూడా చాలా మంది యూజర్లకు అందుబాటులో లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)