You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
ఒలింపిక్ వేడుకలు టోక్యోలోని జపాన్ నేషనల్ స్టేడియంలో అట్టహాసంగా మొదలయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న పరిమితులు, నియంత్రణల మధ్య ఖాళీగా ఉన్న స్టేడియంలో పోటీలు జరగనున్నాయి.
ఈ క్రీడల ప్రారంభ వేడుకకు జపాన్ చక్రవర్తి నరాహితో హాజరయ్యారు.
అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బేచ్ ఆయనకు సాదర ఆహ్వానం పలికారు.
1960లో జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ సమయంలో తన నాలుగేళ్ల వయసులో వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఇప్పుడు చక్రవర్తి హోదాలో మరోసారి ఈ వేడుకలలో పాలుపంచుకుంటున్నారు.
ప్రస్తుత వేడుకలకు వెయ్యి కంటే తక్కువ మందే హాజరయ్యారు.
కళ్లు చెదిరే లైట్ షో, మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులతో ఆరంభ వేడుకలు ఆకట్టుకున్నాయి.
ఒలింపిక్స్ సంప్రదాయం ప్రకారం తొలుత గ్రీస్ అథ్లెట్లు ఒలింపిక్ మైదానంలో పరేడ్ చేశారు.
ఆ తరువాత అర్జెంటీనా, ఇతర దేశాల క్రీడాకారులు తమతమ దేశాల పతాకాలు ధరించి స్టేడియంలో పరేడ్ చేశారు.
మెరిసిన భారత పతాక
ఒలింపిక్ మైదానంలో భారత అథ్లెట్లు అడుగుపెట్టారు. భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ మేరీ కోమ్ భారత జెండాను పట్టుకుని ముందు నడవగా మిగతవారంతా వారిని అనుసరించారు.
ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం వహించడం ఇది 25వ సారి.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాలలో ఇదే అతి పెద్దది.
ఆగస్ట్ 8 వరకు
ఈ రోజు(జులై 23) నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌లోని టోక్యోలో ఈ పోటీలు జరగబోతున్నాయి.
అయితే, ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందే, అంటే జులై 21నే ఫుకుషిమాలో ''సాఫ్ట్‌బాల్'' పోటీలు మొదలయ్యాయి.
33 విభాగాల్లో 339 పతకాల కోసం ఈ సారి క్రీడాకారులు పోటీ పడబోతున్నారు.
తొలి పతక ప్రధాన కార్యక్రమం శనివారం(జులై 24) నిర్వహిస్తారు.
టోక్యోలో జరుగుతున్న ఈ వేడుకలను విదేశీయులు నేరుగా చూసేందుకు అనుమతి లేదు.
వేడుకల ప్రారంభం రోజున భారత అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు.
గతంలో ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న యోగీశ్వర్, కరణం మల్లీశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టోక్యో నుంచి వచ్చాక భారత అథ్లెట్లు అందరినీ ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కలుస్తారని అనురాగ్ ఠాకుర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)