అంగారకుడిపై రోవర్ దిగుతున్న అద్భుత దృశ్యాలు విడుదల చేసిన నాసా

వీడియో క్యాప్షన్, అంగారకుడిపై రోవర్ దిగుతున్న అద్భుత దృశ్యాలు విడుదల చేసిన నాసా

అంగారకుడిపై పెర్సీవరెన్స్‌ రోవర్ దిగుతున్న దృశ్యాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది.

జెజీరో క్రేటర్‌పై బ్యాక్‌పాక్ సాయంతో రోవర్ దిగుతున్నప్పుడు అక్కడి మట్టి గాల్లోకి లేచినట్లు కనిపిస్తోంది.

పెర్సీవరెన్స్ ల్యాండింగ్‌ను జాగ్రత్తగా గమనించేందుకు రోవర్‌కు ఏడు కెమెరాలను నాసా అమర్చింది.

2020 జులై 30న అట్లాస్-5 రాకెట్‌ సాయంతో ఈ రోవర్‌ను పంపించారు.

అంగారక ఉపరితలంపై జీవుల మనుగడకు సంబంధించిన ఆనవాళ్లపై ఈ రోవర్ దృష్టి సారిస్తుంది. అక్కడి మట్టి నమూనాలను భూమికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)