You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా: 7600 టన్నుల బిల్డింగ్‌ను ఎత్తి పక్కన పెట్టారు
చైనాలోని షాంఘై నగరంలో ఇంజినీర్లు ఓ అద్భుతమైన ఫీట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7600 టన్నుల బరువైన పెద్ద భవనాన్ని అక్కడి నుంచి తీసి వేరే ప్రదేశానికి చేర్చారు.
షాంఘై నగరంలో ఓ కొత్త ప్రాజెక్టు కోసం అవసరమైన బిల్డింగ్ నిర్మించడానికి 1935నాటి ఐదంతస్తుల స్కూల్ బిల్డింగ్ అడ్డుగా నిలిచింది.
వాస్తవానికి ఆ భవనాన్ని కూల్చేయవచ్చు. కానీ చారిత్రక భవనం కావడంతో కూలగొట్టరాదని ప్రభుత్వం భావించింది. సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించి బిల్డింగ్‌ను వేరే చోటికి మార్చాలని నిర్ణయించారు.
చైనా మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం 7600 టన్నుల బరువున్న ఆ కాంక్రీట్ భవనాన్ని ఉన్నచోటు నుంచి 62 మీటర్ల దూరం జరపాలని నిర్ణయించి పూర్తి చేశారు.
ఈ భవనాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి 18 రోజులు పట్టిందని చైనాకు చెందిన సీసీటీవీ న్యూస్ నెట్‌వర్క్ వెల్లడించింది. అక్టోబర్ 15న ఈ భవనం తరలింపు ప్రక్రియ పూర్తయింది.
ఈ మార్పు సందర్భంగా భవనానికి ఏవైనా ఇబ్బందులు కలిగాయేమో పరిశీలించిన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులు భావిస్తున్నారని సీసీటీవీ న్యూస్ తెలిపింది.
రోబోటిక్ టెక్నాలజీ
బిల్డింగ్‌లను ఇలా ఒకచోట నుంచి మరొకచోటికి మార్చడానికి సాంకేతికంగా అనేక మార్గాలున్నాయి. సాధారణంగా వీటిని ప్లాట్‌ఫాంల మీదకు చేర్చి అధిక సామర్ధ్యం ఉన్న క్రేన్‌లు, గొలుసుల ద్వారా లాగుతారు.
కానీ ఈ భవనం విషయంలో చైనీస్ ఇంజినీర్లు రోబోటిక్ లెగ్స్ (రోబో కాళ్లు) ద్వారా దీన్ని జరిపే ప్రయత్నం చేశారు. ఈ రోబోటిక్ లెగ్స్ కింద చక్రాలు ఉంటాయి.ఈ టెక్నాలజీని చైనా ఇంజినీర్లు తొలిసారి వాడారు.
ఈ బిల్డింగ్ ను మార్చడానికి పని చేసిన ఇంజినీర్లకు గతంలో కూడా ఈ పనులు చేసిన అనుభవం ఉంది.135 సంవత్సరాల కిందట నిర్మించిన 2 వేల టన్నుల బరువైన బుద్ధుడి ఆలయాన్ని 2017లో 30 మీటర్ల దూరం తరలించారు. ఈ 30 మీటర్ల తరలింపుకు 15రోజుల సమయం పట్టింది.
ఈ ఏడాది ఆరంభంలో కూడా చైనా ఇంజినీర్లు ఓ ఫీట్ చేశారు. కరోనా రోగుల కోసం హుబే ప్రావిన్స్‌లో వెయ్యి పడకల ఆసుపత్రిని అత్యంత వేగంగా నిర్మించి రికార్డు సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- సోషల్ మీడియా: అభ్యంతరకర ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చేశారు?
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతోందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)