చనిపోయే ముందు ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న క్యాన్సర్ పేషెంట్

వీడియో క్యాప్షన్, చనిపోయే ముందు ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న క్యాన్సర్ పేషెంట్

టాష్ లాంగ్‌హర్ట్ ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడింది. కానీ, ఆ పోరాటానికి ఆమె శరీరం సహకరించట్లేదని, చికిత్సకు స్పందించటం లేదని ఇంగ్లండ్‌లోని డాక్టర్లు చెప్పారు.

ఇక ఆమె కొన్ని వారాల పాటు మాత్రమే బతుకుతుందని కూడా డాక్టర్లు స్పష్టం చేశారు.

25 ఏళ్ల టాష్‌కి అరుదైన క్యాన్సర్ (స్పైండల్ సెల్ సర్కోమా) సోకింది. మొదట్లో అది ఛాతి నొప్పిలాగా అనిపిస్తుంది.

తన ప్రేమను తెలపాలని, ప్రపోజ్ చేయాలని.. సరైన సమయం కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ సైమన్ యంగ్ ఎదురుచూశాడు. కానీ, ఇక వేచి చూసే సమయమూ లేదు.. సరైన సమయమూ లేదు.

దీంతో ఆసుపత్రిలోనే తన ప్రేమను వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత ఏం జరిగిందో సైమన్ మాటల్లోనే పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)