వేడినీళ్లతో స్నానం చేస్తే డిప్రెషన్ దూరమవుతుందా?
ఎక్కువగా కనిపించే మానసిక సమస్యల్లో కుంగుబాటు(డిప్రెషన్)దే మొదటి స్థానం. వేడినీటి స్నానం ఆ సమస్యకు చక్కని పరిష్కారం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
కుంగుబాటుతో బాధపడేవాళ్లు తరచూ వేడి నీటితో స్నానం చేయాలని, దాని వల్ల మూడ్ పూర్తిగా మారిపోతుందని జర్మనీకి చెందిన ఫ్రీబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
రోజు మొత్తంలో మన శారీరక, జీవరసాయన మార్పులు అలల రూపంలో జరుగుతుంటాయి. దాన్ని సిర్కేడియన్ రిథమ్ అంటారు. కుంగుబాటుతో బాధపడేవాళ్లలో ఈ క్రమం దెబ్బతింటుంది. ఈ రిథమ్‌పై వేడి నీళ్లు సానుకూల ప్రభావం చూపుతాయి.
మధ్యాహ్నం పూట వేడినీటితో స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆ రిథమ్ నియంత్రణలోకి వస్తుంది. కనీసం ఓ అరగంటపాటు అలా నీళ్ల కింద కూర్చోవాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుందని చెబుతున్నారు.
ఇప్పటిదాకా డిప్రెషన్‌కు మూలకారణాలేంటో పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. మానసిక చికిత్స, వ్యాయామం, యాంటీ డిప్రెసెంట్ల సాయంతో వైద్యులు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.
వ్యాయామంతో పోలిస్తే వేడినీటి స్నానం మెరుగైన ఫలితాలనిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. తక్కువ స్థాయి డిప్రెషన్‌కు ఈ పద్ధతి మరింత అనువైందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)