కరోనావైరస్: యాంటీబాడీ పరీక్ష అంటే ఏంటి?

ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది కోవిడ్-19 బారిన పడుతున్నారు.

ఇలా లక్షణాలు లేనివారికి కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు యాంటీబాడీ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

చేతికి సూది గుచ్చి, రక్తాన్ని సేకరించి, దానిని ఒక స్ట్రిప్‌పై వేసి ఈ పరీక్ష జరుపుతారు.

ప్రస్తుతం కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ముక్కులో స్రావాన్ని పరీక్షిస్తున్నారు.

అయితే, ఈ పరీక్షలు శరీరంలో వైరస్ ఉందో లేదో మాత్రమే తెలుస్తాయి.

అప్పటికే వైరస్ వచ్చి పోయిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం చెప్పవు. అంటే ఒకవేళ వైరస్ బారిన పడి కోలుకుంటే స్వాబ్ పరీక్షలో ఆ విషయం వెల్లడి కాదు.

యాంటీబాడీ పరీక్ష వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)