కరోనావైరస్: ఆర్ నాట్ అంటే ఏంటి? ఇది ఎందుకంత కీలకం?

కరోనావైరస్ తో పొంచి ఉన్న ముప్పును అర్ధం చేసుకోవడం వెనుక ఒక కీలకమైన సంఖ్య ఉంది. ప్రజల ప్రాణాలని కాపాడటానికి కానీ, లాక్ డౌన్‌ను ఎంతమేరకు సడలించవచ్చనే నిర్ణయాలని తీసుకోవడానికి కానీ ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలకి ఈ సంఖ్య మార్గదర్శకంగా నిలుస్తోంది.

ఇది 'ఆర్ నాట్' అని పిలిచే ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య.. R0. దీనిని ఆర్ అని కూడా అంటుంటారు.

ఒక వ్యాధి వ్యాప్తి చెందే సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి పునరుత్పత్తి సంఖ్య సహాయపడుతుంది.

ప్రజలెవరికీ రోగ నిరోధక శక్తి లేని పక్షంలో వ్యాధి సోకిన రోగి నుంచి సగటున వైరస్ ఎంత మందికి వ్యాప్తి చెందగలదని అంచనా వేసే సంఖ్యని ఆర్ నాట్ అంటారు.

తట్టు వ్యాధి తీవ్రంగా ప్రబలితే దాని పునరుత్పత్తి సంఖ్య 15 ఉంటుంది. ఇది తీవ్ర స్థాయిలో ప్రబలవచ్చు.

ఇప్పుడు తలెత్తిన కోవిడ్-19 పునరుత్పత్తి సంఖ్య 3. కానీ, అంచనాలు మారే అవకాశం ఉంది.

ఇది ఎందుకు కీలకమో తెలుసుకునేందుకు పై వీడియో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)