You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్కాట్లాండ్: రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది
- రచయిత, మాగ్నస్ బెన్నెట్
- హోదా, బీబీసీ స్కాట్లాండ్ న్యూస్
అతిపెద్ద ప్రైవేటు విస్కీ సంపదను వేలం వేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో విస్కీ వేలం వేసే సంస్థ 'విస్కీ ఆక్షనీర్' 3,900 సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ సీసాలను వచ్చే ఏడాది విక్రయించబోతోంది.
ఈ బ్రహ్మాండమైన విస్కీ సంపదలో మెకలాన్, బౌమోర్, స్ప్రింగ్ బ్యాంక్ డిస్టిలరీలకు చెందిన కొన్ని అరుదైన సీసాలున్నాయి.
ఈ మొత్తం సంపద 70 లక్షల నుంచి 80 లక్షల పౌండ్లకు వేలంలో అమ్ముడుపోతుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీలో రూ. 65 కోట్ల నుంచి రూ. 74 కోట్ల వరకు ఉంటుంది.
పెర్త్ కేంద్రంగా పనిచేసే 'విస్కీ ఆక్షనీర్' దీని గురించి చెబుతూ.. ''20వ శతాబ్దపు స్కాటిష్ డిస్టిలరీస్‌కు చెందిన సంపూర్ణమైన ప్రైవేట్ కలెక్షన్ ఇది'' అని వివరించింది.
2014లో మరణించిన ఒక అమెరికా వ్యాపారవేత్త కుటుంబం ఈ విస్కీసంపదను అమ్మకానికి పెట్టింది.
ఒకప్పుడు అమెరికాలో శీతలపానీయాల అతిపెద్ద పంపిణీదారుగా పేరున్న కొలరాడోకు చెందిన రిచర్డ్ గూడింగ్ అనే ఆ వ్యాపారవేత్త సుమారు 20 ఏళ్ల పాటు సేకరించిన సీసాలివి.
ఈ భారీ సేకరణలో 60 ఏళ్ల పాతవైన మెకలాన్ 1926 వలేరియో అడామీ లేబుల్ వంటివి ఉన్నాయి.
అక్టోబరులో మెకలాన్ 1926 సీసా విస్కీ ఒకటి 15 లక్షల పౌండ్లకు అమ్ముడుపోయింది.
ఇందులో ఇంకా 50 ఏళ్ల పాతదైన స్ప్రింగ్ బ్యాంక్, ఓల్డ్ లాలిక్ వంటివి ఉన్నాయి.
కొద్దికాలం కిందటి వరకు ఇవన్నీ గూడింగ్ ఇంట్లో వీటికోసమే సిద్ధం చేసిన ఒక గదిలో ఉండేవి.
ఎవరీ రిచర్డ్స్ గూడింగ్?
గూడింగ్ తాత జేమ్స్.ఎ.గూడింగ్ 1936లో పెప్సీకోలా బాట్లింగ్ కంపెనీని ప్రారంభించారు.
1979లో దీనికి రిచర్డ్స్ గూడింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి చేపట్టారు. 1988లో పెప్పికోకు దాన్ని విక్రయించారు.
రిచర్డ్ గూడింగ్ 67 ఏళ్ల వయసులో 2014 జూన్‌లో చర్మ క్యాన్సర్‌తో మరణించారు.
రిచర్డ్స్ ప్రత్యేకమైన విస్కీ సీసాల సేకరణ కోసం తన ప్రైవేట్ జెట్‌లో తరచూ స్కాట్లాండ్ వెళ్లేవారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఇందుకోసం ఆయన వేలంపాటల్లో పాల్గొనడంతో పాటు డిస్టిలరీలకూ వెళ్లేవారట.
ఇంతకీ రిచర్డ్స్ గూడింగ్ ఫేవరెట్ బ్రాండ్ ఏది?
''రిచర్డ్స్‌కు ఉన్న గొప్ప అభిరుచి స్కాచ్ విస్కీ సేకరణ''ని ఆయన భార్య నాన్సీ చెప్పారు.
ప్రతి డిస్టిలరీ నుంచి వచ్చిన విస్కీ తన కలెక్షన్లో ఉండాలని ఆయన కోరుకునేవారని చెప్పారామె.
రిచర్డ్స్‌కు వ్యక్తిగతంగా అన్నిటికంటే బ్లాక్ బౌమోర్ విస్కీ అంటే ఇష్టమని చెప్పారు.
కాగా రిచర్డ్స్ గూడింగ్ సేకరించిన విస్కీ సీసాల వేలంపాట 'విస్కీ ఆక్షనీర్'లో 2020 ఫిబ్రవరి 7 నుంచి 17 వరకు.. ఆ తరువాత ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఉంటుందని విస్కీ ఆక్షనీర్ వ్యవస్థాపకుడు మెక్ క్లూన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- అక్కడ మహిళలకు మద్యం అమ్మరు! ఎందుకంటే..
- ''తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి'': ఆదివాసీల హక్కుల పోరాట సమితి
- ‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’
- ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం
- చిన్న వయసులో ఫిన్లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)