You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్
''మన శరీరాన్ని మన సొంతం చేసుకునే ఆలోచన చేయటం చాలా కష్టం. శరీరంలో ఒక అవయవాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకోవటం తీవ్రమైనదే'' అంటారు విక్టోరియా మోడెస్టా.
విక్టోరియా మోడెస్టా ఒక కళాకారిణి. ఆమె యూరప్‌లోని లాత్వియా దేశంలో జన్మించారు. ఆమె ఎడమ కాలు చిన్నప్పటి నుంచి పనిచేయలేదు.
దాంతో, ఆమె తన మోకాలి నుంచి కింది భాగాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడామె వయసు 20 ఏళ్లు.
''నాకు రకరకాల కృత్రిమ కాళ్లు చాలా ఉన్నాయి. కొన్ని సహజంగా కనిపిస్తాయి. కొన్ని సహజంగా కనిపించవు. కానీ నా అసలు ఉద్దేశం.. భవిష్యత్తులో మనిషి మెరుగుపరిచిన అస్తిత్వాన్ని ఎలా చూస్తామనేది'' అంటారామె.
విక్టోరియా తన నూతన ప్రదర్శన కోసం రిహార్సల్ చేస్తున్నారు. పారిస్‌లోని ప్రఖ్యాత క్రేజీ హార్స్ కాబరే ఇది.
''ఈ షోలో నేను బయోనిక్ షోగర్ల్‌గా నటిస్తున్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే ఈ చిన్న భాగాన్ని చూపించే ప్రయాణం చేస్తున్నాం మేం'' అని విక్టోరియా వివరించారు.
ఈమె 2014లో 'ప్రొటోటైప్' అనే వీడియోను విడుదల చేశారు. అందులో అసాధారణమైన కృత్రిమ కాళ్లతో పెర్ఫామ్ చేశారీమె. యూట్యూబ్‌లో 1.2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు.
''సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేసి ఉపయోగించే వీలు కళకు ఉంది. అది మన ఊహాశక్తికి పదునుపెడుతుంది. మనిషి శక్తిసామర్థ్యాలను మరింతగా ఇనుమడింపచేస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: వైద్యుడిపై ఆరోపణలు, దాడి... సంచలనం రేపిన సీసీటీవీ ఫుటేజ్
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ఆ గవర్నమెంటు స్కూల్లో సీటు దొరకడం చాలా కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)