You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉబర్ కొత్త ఆప్షన్: ‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’
క్యాబ్‌లో ప్రయాణంలో డ్రైవర్‌తో సంభాషణ వద్దనుకునే వినియోగదారుల కోసం 'ఉబర్' యాప్ ఒక ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
'క్వైట్ ప్రిఫర్డ్(quite preferred)' పేరుతో ఉబర్ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం 'ఉబర్ బ్లాక్' సర్వీసుల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.
ప్రయాణికుడు ఈ ఫీచర్‌ను వాడుకోవడానికి అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవర్ సంభాషణా నైపుణ్యాలకు ప్రయాణికులు రేటింగ్ ఇచ్చే వెసులుబాటు ప్రస్తుతం ఉబర్ యాప్‌లో ఉంది. ఈ విషయంలో మంచి స్కోరు తెచ్చుకోవాలనుకునే డ్రైవర్లు అవసరం లేకపోయినా ప్రయాణికులతో మాట కలిపేందుకు, సంభాషణ సాగించేందుకు ప్రయత్నిస్తుంటారు.
కొత్త ఆప్షన్‌పై వినియోగదారులు, డ్రైవర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రయాణికులు చాలా మంది దీనిని స్వాగతిస్తున్నారు. అదే సమయంలో, కొందరు దీనిని తప్పుబడుతున్నారు. ఇది డ్రైవర్ల పట్ల అగౌరవకరమైన చర్యని దీనిని వ్యతిరేకించేవారు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్యాక్సీ డ్రైవర్‌తో మాట్లాడం ఇష్టం లేకపోతే ఆ విషయం సున్నితంగా నేరుగా చెప్పొచ్చని ట్విటర్‌లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఉబర్ డ్రైవర్ మైక్ బీబీసీతో మాట్లాడుతూ- ఈ ఆప్షన్ భద్రతను పెంచుతుందని చెప్పారు.
మరో డ్రైవర్ స్పందిస్తూ- ఇది అనవసరమైన ఆప్షన్ అని అభిప్రాయపడ్డారు.
ప్రయాణికులతో మాట్లాడేందుకు డ్రైవర్లు ప్రయత్నించడాన్నిగాని, వారు తమతో మాట్లాడొద్దని ప్రయాణికులు కోరుకోవడాన్నిగాని తప్పుబట్టలేమని లండన్‌కు చెందిన లైఫ్‌స్టైల్ కోచ్ ఫెలిసిటీ మోర్స్ చెప్పారు.
అయితే అందరం సంఘజీవులమని, ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుకోవడం అవసరమేనని, ఇలాంటి అనుభవాలు పనిలో, ఇంట్లో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులకు మనల్ని సిద్ధం చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- మీరు తాగితే ఉబర్‌కు తెలిసిపోద్ది
- ఉబర్ డిజిటల్ సేవల సంస్థ కాదు.. రవాణా సంస్థే
- స్కై ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్!
- పసిబిడ్డను సజీవ సమాధి చేసిన తల్లి.. మట్టిని తవ్వి బిడ్డను కాపాడిన శునకం
- బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
- కేదార్నాథ్ గుహలో మోదీ ధ్యానం: కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసిన మొదటి ప్రధాని అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఇలాంటి బస్సులో ఎప్పుడైనా ప్రయాణించారా
- డ్రైవర్ లేకుండా 92 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)