You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రాన్స్‌జెండర్స్ స్కూల్.. ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే
మనకు రకరకాల స్కూళ్ల గురించి తెలుసు. కానీ చిలీలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక స్కూల్ ఉంది.
ఈ స్కూలును ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్స్ కోసమే ఏర్పాటు చేశారు. దీని పేరు అమరాంటా స్కూల్.
మెక్సికో ట్రాన్స్‌జెండర్ రాజకీయ నాయకుడు 'అమరాంటా గోమెజ్ రీగలాడో' పేరునే ఈ స్కూలుకు పెట్టారు.
6 నుంచి 17 ఏళ్ల వయసున్న ట్రాన్స్‌జెండర్స్ ఇక్కడ చదువుకోవచ్చు.
గత ఏడాది ప్రారంభించిన ఈ ట్రాన్స్‌జెండర్స్ స్కూల్లో మొత్తం 38 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 23 మందిని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తించారు.
ఇక్కడ చదివే మిగతా విద్యార్థులందరూ ట్రాన్స్‌జెండర్ పిల్లల స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు.
ఇక్కడ చదువుతున్న వారందరూ ఈ ఏడాది స్టేట్ బోర్డ్ పరీక్షలు రాయబోతున్నారు.
స్కూల్లో సాధారణ జీవితం గడిపుతున్నామని, ట్రాన్స్‌జెండర్‌గా ఉండడమంటే తమకు స్వేచ్ఛ ఉన్నట్టే అని ఇక్కడ చదివే పిల్లలు చెబుతున్నారు.
ఈ స్కూల్లో పిల్లలు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటున్నారు. మీరు ఆడా, మగా అనేది నిజానికి అంత ముఖ్యం కాదు. ఇక్కడ పిల్లలు స్వేచ్ఛగా ఒకరికొకరు కలిసి ఉంటున్నట్టే భావిస్తున్నాను" అని స్కూల్ ప్రిన్సిపాల్ ఎవెలిన్ సిల్వా చెప్పారు.
ఇంతకు ముందు బాలికల స్కూల్లో చదివిన 17 ఏళ్ల మాటియో కూడా గత ఏడాది అమరాంటా స్కూల్లో చేరింది.
"ఇంతకు ముందు నేను వేరే స్కూల్లో చదివాను. కానీ వాళ్ళు నాకు కావల్సినట్టు సహకరించలేదు. అందుకే ఏడాది పాటు ఆ స్కూలుకు వెళ్లలేదు. ఇప్పుడు ఇక్కడ చేరాను" అని మాటియో చెప్పింది.
ఈ స్కూలుకు అందే నిధులు ఆగిపోవడంతో, దాన్ని నడపడం కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఒక్కో విద్యార్థికి నెలకు ఏడు డాలర్ల ఫీజు వసూలు చేస్తున్నారు.
ఈ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న రొమినా రామిరెజ్ "ఈ స్కూల్ నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు లభించని ఎన్నో సౌకర్యాలను ఇక్కడి విద్యార్థులకు అందించే అవకాశం లభించింది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భయంకరమైన పీడకలలకు రూపం ఇస్తే..
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- ఈమె ఎవరో తెలుసా? షోలే 'బసంతి'కి డూప్.. బాలీవుడ్ తొలి స్టంట్ ఉమన్
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- ముగ్గురు భర్తలు... ముగ్గురు పిల్లలు...16 మంది అత్యాచార నిందితులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)