మలం మ్యూజియం: ఇది కంపు కొట్టదు, సరదాగా ఉంటుంది
'మలం' మ్యూజియం చూడ్డానికి టూర్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ముందు దాని గురించి తెలుసుకోవాలి.
"ప్రపంచంలో తొలి మలం మ్యూజియం"ను జపాన్‌లో ఇటీవలే ప్రారంభించారు. కానీ దీన్ని అసహ్యించుకోనక్కర్లేదు. ఇక్కడ ఉన్నవి నిజం మానవ వ్యర్థాలు కాదు.
ఇది టోక్యోలో ఉంది. దీనిని 'ది ఉంకో(మలం) మ్యూజియం' అంటున్నారు.
ఇక్కడ అందరినీ సరదాగా ఆకట్టుకునేలా రంగురంగుల్లో ఉండే 'పూప్' బొమ్మలు కనిపిస్తాయి.
ఇది ఇప్పుడు ఫేమస్ కావడంతో ఈ మ్యూజియంను చూడ్డానికి చాలా మంది వస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది పిల్లలే. అందరూ పూప్ బొమ్మలతో ఫొటోలు తీసుకుంటున్నారు.
ఈ మ్యూజియంలో ఉన్న ఒక మైక్రోఫోన్ ముందు పూప్ అని ఎంత గట్టిగా అరిస్తే స్క్రీన్‌పై అంత పెద్ద మలం ఇమేజ్ కనిపిస్తుంది.
సాధారణంగా మలం అంటే జుగుప్స కలిగిస్తుంది. కానీ ఈ మ్యూజియంకు వచ్చేవారు మాత్రం తమ అనుభవాలను అందరికీ చెప్పుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మ్యూజియానికి రోజూ వెయ్యి మందికి పైగా వస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- శృంగారం తర్వాత పెళ్లి చేసుకోకుండా మాట తప్పితే అత్యాచారమేనా?
- పారిస్‌లో అగ్నిప్రమాదం: 850 ఏళ్ల నాటి చర్చిలో మంటలు
- వికీలీక్స్ సహ-వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అరెస్ట్
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)