You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
T20 క్రికెట్ వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. భారత పురుషుల, మహిళల జట్లు ఆడే మ్యాచ్‌లు ఇవే
టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ విడుదలైంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూలును ఐసీసీ సిడ్నీలో విడుదల చేసింది.
మొదటిసారి మహిళలు, పురుషుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ సిరీస్ ఒకే సంవత్సరంలో ఒకే దేశంలో జరగబోతున్నాయి.
టాప్ 10 మహిళల జట్లు ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లన్నీ ఆస్ట్రేలియాలోనే జరుగుతాయి. మొదటి మ్యాచ్ 2020 ఫిబ్రవరి 21న జరుగుతుంది. ఫైనల్ మార్చి 8న జరుగుతుంది.
టాప్ 16 పురుషుల జట్లు పాల్గొనే పురుషుల వరల్డ్ కప్‌లో 45 మ్యాచ్‌లు ఉంటాయి. 2020 అక్టోబరు 18న జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబరు 15న ఫైనల్ జరుగుతుంది.
మహిళలు, పురషుల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లు రెండూ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతాయి.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మ్యాచ్‌లు
భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో 2020 ఫిబ్రవరి 21న తలపడుతుంది.
- ఫిబ్రవరి 21, 2020 - భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
- ఫిబ్రవరి 24, 2020 - భారత్ వర్సెస్ క్వాలిఫైయర్ 1
- ఫిబ్రవరి 27, 2020 - భారత్ వర్సెస్ న్యూజీలాండ్
- ఫిబ్రవరి 29, 2020 - భారత్ వర్సెస్ శ్రీలంక
మార్చి 5నే రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మ్యాచ్‌లు
భారత పురుషుల జట్టు తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో 2020 అక్టోబర్ 24న తలపడుతుంది.
- అక్టోబర్ 24, 2020 - భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- అక్టోబర్ 29, 2020 - భారత్ వర్సెస్ ఏ2 (మొదటి క్వాలిఫైయర్ గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన జట్టు)
- నవంబర్ 1, 2020 - భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- నవంబర్ 5, 2020 - భారత్ వర్సెస్ బీ1 (రెండో క్వాలిఫైయర్ గ్రూపులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు)
- నవంబర్ 8, 2020 - భారత్ వర్సెస్ అఫ్ఘానిస్థాన్
నవంబర్ 11, 12 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే...
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)