మూతపడ్డ ప్రపంచ అతిపెద్ద చేపల మార్కెట్
జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న త్సుకిజీ చేపల మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అది. అయితే, 83 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్, శనివారంనాడు ఆఖరి వేలంపాటతో శాశ్వతంగా మూతబడింది.
టోక్యో నగరంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన త్సుకిజీ చేపల మార్కెట్ 83 ఏళ్లుగా నిర్విరామంగా నడుస్తోంది. అంతే కాదు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ కూడా.
ఈ మార్కెట్‌ను 1935లో ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే ఇది అభివృద్ధి చెంది ప్రధాన మార్కెట్ మారింది. 'ది కిచెన్ ఆఫ్ జపాన్' అన్న పేరు కూడా సంపాదించుకుంది.
ఇక్కడ ఒక్కోరోజు దాదాపు 60 వేల మంది దాకా లావాదేవీలు జరుపుతుండేవారు.
అయితే ఇప్పుడు వందలాది మంది చేపల వ్యాపారులు తమ దుకాణాలను సర్దుకొని కొత్త మార్కెట్‌కు వెళ్లిపోయే పనిలో ఉన్నారు. 2020లో జరగబోయే ఒలింపిక్స్‌లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది జపాన్ ప్రభుత్వం. అందుకోసం మరోచోట కొత్త మార్కెట్‌ను నిర్మించింది.
ఇవి కూడా చదవండి:
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ఆమిర్ ఖాన్‌కు చైనాలో అంత ఫాలోయింగ్ ఎందుకు?
- #గమ్యం: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇలా అవ్వచ్చు
- ఇది హెలికాప్టర్లలో పరారైన దొంగల కథ - నమ్మలేరు కానీ నిజం
- కేన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!
- నాసా సదస్సుకు ఎంపిక కావాలంటే కార్పొరేట్ స్కూల్స్‌లోనే చదవాలనేం లేదు!
- గొడ్డలివేటు నుంచి 16 వేల చెట్లను దిల్లీ ప్రజలు కాపాడుకున్న తీరిదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)